Home / Inspiring Stories / దొంగలను ఎదురించిన ఆరేళ్ల బాలిక.

దొంగలను ఎదురించిన ఆరేళ్ల బాలిక.

Author:

పక్కవాళ్ళు ఆపదలో ఉంటే పెద్దవాల్లే ఎం చేయలేక పక్కకు తప్పుకుంటున్న రోజులు ఇవి, కాని ఒక ఆరేళ్ళ చిన్న అమ్మాయి తన ముందు జరుగుతున్న దారుణాన్ని ఆపడానికి ప్రయత్నించి అందరి మన్ననలు అందుకుంటుంది. ఆ చిన్నారి కథ మీ కోసం.

six-year-old-girl-fighting-with-the-thieves
న్యూజిలాండ్ లోని ఆక్లాండులో భారత సంతతికి చెందిన ఆరేళ్ళ సారహ్ పటేల్ తన కుటుంబంతో సహ నివసిస్తొంది. ఒకరోజు ఆ అమ్మాయి తాతతో కలిసి ఆమే తండ్రికి కి చెందిన ఎలక్ట్రానిక్ షాపు కు వెళ్ళింది. ఆ సమయంలోనే ఆ షాపులోకి కొందరు సాయుదులైన దొంగలు చొరబడ్డారు. గొడ్డల్లతో మరియు ఇతర ఆయుదాలతో దొంగలు బీభత్సం సృష్టించారు. డబ్బులు దోచుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఒక దొంగ ఆ షాపుకు చెందిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయబోయాడు. తన కనుల ముందు జరుగుతున్న ఆ దారుణాన్ని చూసిన సారహ్ పరుగెత్తుకుంటు వెళ్ళి ఆ దొంగను పక్కకు నెట్టే ప్రయత్నం చేసింది. తర్వాత కూడ బయటకు వెళ్ళకుండ తన తాత దగ్గరికి పరుగెత్తి అతనిని షాపు బయటకు తీసుకువచ్చింది. ఆ తర్వాత పొలీసులకు సమచారం కూడా అందించింది.

పై సంఘటన మొత్తం సాపులోని సీసీ టీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఇప్పుడు ఆ వీడియో బయటకి విడుదల అవడంతో చిన్నారి సారహ్ సాహసం అందరిని అబ్బురపరుస్తోంది. దొంగలు అయుదాలు కలిగి ఉన్నా కూడా బయపడకుండా సాహసం ప్రదర్షించిన ఈ చిన్నారిని అందరూ అభినందించాల్సిందే.

(Visited 1,391 times, 8 visits today)