Home / Political / అందం,ఆరోగ్యం పెరగాలంటే స్కిప్పింగ్‌ చేయాలంటున్న వైద్యులు

అందం,ఆరోగ్యం పెరగాలంటే స్కిప్పింగ్‌ చేయాలంటున్న వైద్యులు

Author:

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎందుకంటే ఒక మనిషి డబ్బుపోతే సంపాదించుకోవచ్చు, ఇళ్ళు లేకపోతే కట్టుకోవచ్చు కానీ ఆరోగ్యం చెడిపోతే మాత్రం తిరిగి సంపాదించడం అంత సులువు కాదు. అందుకే మనిషి ఏమి ఉన్నా, ఏమి లేకపోయిన ఆరోగ్యముగా లేకపోతే ఎందుకు పనికిరాడు. ఆరోగ్యముగా ఉంటే అడివిలోనైనా బ్రతికేయగలడు. మనిషికే కాదు ప్రపంచములో ప్రతిజీవికి ఇదే సూత్రము జీవన మనుగడలో ముఖ్యమైనది. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఏ రోగాలు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. బ్రతికినన్నినాళ్ళు  హాయిగా ఆయురు ఆరోగ్యలతో బ్రతకాలన్నదే నిజమైన జీవన విధానము .

          కొద్దిపాటి వ్యాయామాలు చేయటం వల్ల శరిరాన్ని మన ఆధీనం ఉంచుకోవచ్చు. మాములుగా అయితే ఈ వ్యాయామాన్ని ఆడవారు ఎక్కువ చేసేవారు కానీ, ఇప్పుడు మగవారు కూడ చేస్తున్నారు. మన అందరికి తెలిసిన వ్యాయమం అదే స్కిప్పింగ్(తాడు ఆట) నిజానికి అది ఒక ఆట కాదు… వెలకట్టలేని వ్యాయామం. ఒక గంటసేపు స్కిప్పింగ్ చేస్తే 1000 క్యాలరీల శక్తి కరిగించబడుతుంది . దీనికి కావల్సింది తాడు మాత్రమే. ఏ సమయములోనైనా ఎక్కడైనా ఎంతో సులభము గా చేయవచ్చును . దీనివల్ల కాళ్ళు, చేతులు, పాదాలన్నిటికీ వ్యాయామము లభిస్తుంది అంటున్నారు వైధ్యులు. అలాగే అందం, ఆరోగ్యం కలకాలం నిలవాలంటే స్కిప్పింగ్‌ చేస్తే చాలా సుగుణాలు కనిపిస్తాయట! స్కిప్పింగ్‌ ఉదయాన్నే చేస్తే చాలా మంచిది. భోజనం ముందుకానీ, భోజనం అయిన రెండు గంటల తర్వాతకానీ స్కిప్పింగ్‌ చేయవచ్చు. మహిళలు, మగవారు తమ శరీరాకృతిని అందంగా మలచుకోవడంతోపాటు బరువును కూడా నియంత్రించేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తుంటారు. కాని సులభమైన పద్దతితో శరీరంలోని బరువును, కొవ్వును కరగదీయవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు…

స్కిప్పింగ్ వలన రక్త సరఫరా మెరుగవుతుంది. కంటికి, పాదాలకు, చేతులకు సమన్వయం పెరిగి మనుషులు చురుకుగా స్పందించగలుగుతారు . క్రమము తప్పకుండా స్కిప్పింగ్ చేస్తే శరీరక బలం పెరుగుతుంది. ఎముకలు బలపడతాయి. సుగరు, బి.పి వ్యాదులు అదుపులోకి వస్తాయి.

స్కిప్పింగ్‌ వల్ల లాభాలు:

. స్కిప్పింగ్‌ చేయడం వల్ల గుండెకు మంచి వ్యాయామం చేకూరుతుంది.
. శరీరంలో వుండే అధిక కొవ్వును తొలగించుకోవచ్చు.
. స్కిప్పింగ్‌ చేయడం వల్ల మనస్సు, శరీరం చురుకుదనాన్ని పొందుతాయి.
.రోజూ స్కిప్పింగ్‌ చేయడం వల్ల అధిక బరువును తగ్గించుకోవచ్చు.
.చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు.
.ఊబకాయాన్ని నియంత్రించేందుకు స్కిప్పింగ్ చేయాలి .
.పొట్టపై పేరుకుపోయిన కొవ్వును సులభంగా కరిగించవచ్చు. ఇక్కడ డైటింగ్ చేయకుండానే శరీరంలోని కొవ్వును కరిగించేయవచ్చును .
.స్కిప్పింగ్‌ చేసిన తరువాత త్వరత్వరగా శ్వాస తీసుకోవాల్సివుంటుంది. దీంతో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. కాళ్ళు తొడల వద్దనున్న కండరాలు బలిష్టంగా తయారవుతుంది.
.స్కిప్పింగ్‌ చేయడంతో ఉదరభాగం లోపలికి-బయటకు వెళుతుంది. దీంతో ఉదరభాగంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు కరిగిపోతుంది.
.స్కిప్పింగ్‌ చేయడంతో తరుచూ భుజాలు తిరుగుతుంటారు. దీంతో భుజాలు గుండ్రంగా తయారవుతాయి.
.చేతి మడమలు తిప్పుతుండటంతో వేళ్ళకు మరింతగా బలం చేకూరుతుంది. రచయితలకు, కళాకారులకు ఇది ఎంతో ఉపయుక్తంగా వుంటుంది.
చిన్న వయసు వారు స్కిప్పింగ్‌ అలవాటు చేసుకుంటే మంచిది. మెదడు విశ్రాంతిగా ఉంటుంది. స్కిప్పింగ్‌ చేయడం వలన శరీరం దృఢంగా తయారవుతుంది.

(Visited 2,122 times, 59 visits today)