EDITION English తెలుగు
Video: సినిమాలకు ఇక సెలవు : పవన్ కల్యాణ్.   ఇక వాట్సాప్ లో డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు.   హైదరాబాద్ నగరం అసలు పేరు ‘ చిచులం ’, ఇదే నిజమైన పేరు, ఈ విషయం చాలామందికి తెలియదని చారిత్రక పరిశోధకుడు పాండులింగారెడ్డి తెలిపారు.   స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.
Home / General / Video: కూల్ డ్రింక్ లో పాము…!

Video: కూల్ డ్రింక్ లో పాము…!

Author:

పాపం ఎండలు మండిపోతున్నాయి..కాస్త చల్లబదదామనుకున్నాడు ఒకాయన. దగ్గరలోనే ఉన్న ఒక షాపుకెళ్ళి ఓ కూల్ డ్రింక్ ఆర్డర్ చేశాడు. షాపతను మూత తీసి చేతికిచ్చాడు. చల్ల చల్లగా ఉన్న ఆ కూల్ డ్రింక్ బాటిల్ ని ఎత్తి నోట్లోకి పోసుకున్నాడు..ఆహ ఎంత చల్లదనం అనుకున్నాడు. ఇంకో సిప్ తాగేలోపు ఒక్కసారిగా షాక్. ఎత్తిన బాటిల్ లో ఏదో కనబడుతోంది. బాటిల్ లోంచి డ్రింక్ పారపోసి చూస్తె మూడు అంగుళాల చచ్చిన పాము. ఇంకేమన్నా ఉందా..కాసేపైతే ఆ పాము కూడా గొంతులోకి దిగిపోయేది. ఇదేంటి బాసూ అని షాపు అతన్ని అడుగుతూనే వాంతి కూడా చేసేసుకున్నాడు సదరు వినియోగదారుడు. ఇదెక్కడి చోద్యం అనుకున్నారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళూ.. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడో జరిగింది అనుకుంటున్నారా? మన పక్కనే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావ‌రి జిల్లాలోని రాజ‌మండ్రి బొమ్మూరు గ్రామంలోని ఓ దుకాణంలో జరిగింది. సదరు వినియోగదారుడి పేరు నాగరాజు. షాపు ఓనర్ ని ఆరా తీసిన తర్వాత సదరు కూల్ డ్రింక్ కంపెనీపై వినియోగ‌దారుల ఫోరంలో ఫిర్యాదు చేయ‌నున్న‌ట్లు తెలిపాడు నాగ‌రాజు.

అయినా తింటున్న అన్నం లో చిన్న రాయి వస్తేనో, ఏ కొత్తిమీర కట్టలో గడ్డి పోచ వస్తేనో ఓ తెగ ఇదయిపోతాం. అవతలి వాళ్ళని కడిగి పారేస్తాం.. మరి ఇలా పేరుకు పేద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు ఇలా ఇష్టారాజ్యంగా కలుషిత నీతినో, చచ్చిన పాముల్ని కలిపేసి తాగేయమంటే మన పరిస్థితి ఏంటి అని వాపోతున్నారు వినియోగదారులు. ఇప్పటికే పెస్టిసైడ్స్ కలుపుతున్నారనే ఒక అనుమానమూ ఉంది. అయినా జనాలు కూల్ డ్రింక్స్ నే కొనుక్కుని మరీ తాగి ఆరోగ్యాన్ని ఖరాబు చేసుకోవడమేంటో ? ప్రభుత్వాలే ఏమీ చేయలేనప్పుడు పాపం జనాలు మాత్రం ఎం చేస్తారులెండి ?

Comments

comments