Home / Political / ఆమెను ప్రేమతో కిడ్నాప్ చేసాడట.

ఆమెను ప్రేమతో కిడ్నాప్ చేసాడట.

Author:

అమ్మాయి ప్రేమ కోసం వెంటపడి వేదించే వారిని చూసాం,ఆమె ప్రేమని అంగీకరించలేదని యాసిడ్ సీసాతో బెదిరించిన వాళ్ళనీ చూసాం. ప్రేమని ఒప్పుకోమని బెదిరింపులకు పాల్పడ్డ వారినీ చూసాం… కానీ తను ప్రేమించిన అమ్మాయిని అనుక్షణం కంటికి రెప్పలా చూసుకుంటూ.. ఎప్పుడైనా తనకు దగ్గర కాకపోతుందా అని ఆమె నిత్యం ప్రయాణించే స్టేషన్ ముందు ఆటోలనికొని మరీ ఉంచాడతను. కిడ్నాప్ చేయటం నేరమే అయినా…కేవలం 36 గంటలు తనతో ఉంచుకొని తన మీద ప్రేమ కలిగేలా చేయటం కోసం తన స్నేహితులతోనే కిడ్నాప్ చేయించి తనే కాపాడి (అదీ నాటకంలో భాగమే అనుకోండి). అప్పుడు కూడా ఆమెని ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూసుకొని జాగ్రత్తగా ఇంటికి చేర్చాడు.. ఇలా అయినా ఆమె ప్రేమను పొందాలనుకున్నాడు…ఒక హిందీ సినిమా కథలో హీరో చేసినట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేసాడు.. కానీ…! చివరికి కథ అడ్డం తిరిగింది అతనిప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళేలా ఉన్నాడు… ఇప్పుడు కూడా అతనికి ఆ అమ్మాయి మీద ఎటువంటి కోపమూ లేదు జైలుకు వెళ్ళినా ఆమె మీద ప్రేమ పోదనీ, ఇకముందు ఆమెని ఇబ్బంది పెట్టకుండా తనని ప్రేమిస్తూ ఉంటాననీ అంటున్నాడు…. ఇంతకీ కథేమిటంటే…

Snap Deal 1

ఆన్‌లైన్ వ్యాపార సంస్థ స్నాప్‌డీల్‌కు చెందిన ఉద్యోగినిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. తన విధులను ముగించుకొని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ మేరకు స్నాప్‌డీల్ ఫౌండర్ కునాల్ బాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీడియా వర్గాల వివరాల ప్రకారం.. దీప్తీ సార్నా అనే యువతి గూర్గావ్‌లోని స్నాప్‌డీల్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోంది. ఆమె ప్రతి రోజు ఆఫీసు వేళలు ముగియగానే మెట్రో రైలు ద్వారా ఘజియాబాద్‌కు వెళుతుంది. అక్కడి రైల్వే స్టేషన్ నుంచి తన ఇంటికి ఆటోలో వెళుతుంది. రోజూ మాదిరిగానే ఇంటికి వెళుతున్న దీప్తి గత రాత్రి ఇంటికి వెళ్లలేదు. ఎక్కడ ప్రయత్నించినా ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో స్నాప్‌డీల్ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలమైంది.సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్ ఈ కేసుని ప్రత్యేకంగా తీసుకోవాలనీ ఎప్పటికప్పుడు స్వయంగా తనకు రిపోర్ట్ చేయాలనీ ఆదేశించారు… దాంతో ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అన్ని ప్రాంతాలను గాలిస్తున్న క్రమంలో ఆమె స్వయంగా తను ఢిల్లీలో ఉన్నాననీ, రైలు ఎక్కివస్తున్నట్లు తన తండ్రికి ఫోన్ చేసి చెప్పింది.అంతే కాదు కొన్ని గంటల్లోనే ఆమె సురక్షితంగా ఇంటికి చేరుకుంది కూడా. విచారణలో ఆమె కిడ్నాపర్లు తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదనీ,తనకు భోజనంతో సహా అన్నీ అందించారనీ చెప్పటంతో పోలీసులు మొదట దీప్తియే నాటకం ఆడుతోందా అన్న దిశలోనూ ఆలోచించారు…. ఆమె చెప్పిన గుర్తుల ప్రకారం వెతికి 5 గురిని అరెస్ట్ చేసారు కూడా… అయితే వారిలో దేవేంద్ర కుమార్ అనే యువకుడు చెప్పిన విషయాలు పోలీసులనే కాదు దీప్తి సర్నాను కూడా ఆశ్చర్య పరిచాయి.

Kidnapped Snapdeal Employee Returns Safely At Home After Two Days

2015 జనవరి నుంచి దీప్తిని వెంబడిస్తున్నట్టు కిడ్నాపర్ దేవేంద్రకుమార్ అంగీకరించాడు. ఘజియాబాద్‌లోని మెట్రో స్టేషన్లో తొలిసారి దీప్తిని చూసి ప్రేమలో పడ్డానని, ఆమె ప్రేమను సొంతం చేసుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసినట్టు పోలీసులకు వెల్లడించాడు. తనను తాను షారుక్‌ఖాన్‌కు వీరాభిమానిగా చెప్పుకొన్న దేవేంద్రకుమార్, 1993లో రిలీజైన డర్ సినిమాలో షారుక్ చేసిన పాత్ర తనకు ఇన్‌స్పిరేషన్ ఇచ్చిందని తెలిపాడు. ఆ పాత్రలో సైకోగా వ్యవహరించిన షారుక్ హీరోయిన్ జుహీచావ్లా ప్రేమను పొందేందుకు చేసిన ప్రయత్నాలనే తాను దీప్తి ప్రేమను పొందేందుకు చేసినట్టు వివరించాడు. ఏడాదికాలంగా ఆమెను తన ప్రేమ ముగ్గులోకి దింపేందుకు 150 సార్లు ప్రయత్నించానన్న దేవేంద్రకుమార్ రెండు ఆటోలను కొనుగోలు చేసి ఘజియాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఉంచానని అయితే దీప్తి ఎప్పుడూ తన ఆటో ఎక్కలేదని తెలిపాడు. ఆమె మెట్రో రైలు ప్రయాణానికే మొగ్గు చూపేదని, మహిళా కంపార్ట్‌మెంట్‌లోనే ప్రయాణించేదని చెప్పాడు. గతవారం తన మనుషులు దీప్తిని బెదిరించి కిడ్నాప్ చేశారని, వారినుంచి ఆమెను రక్షించినట్టు నాటకమాడి, ఆమెకు ఎలాంటి హాని తలపెట్టకుండా 36గంటలపాటు తనతో ఉండేలా చూశానని, తన మనసు తెలుసుకునేలా, తన ప్రేమలో పడేలా ప్రయత్నించానని, దీప్తికి సమయానికి భోజనం పెట్టడంతోపాటు ఆమెకు ఇష్టమైన బ్రాండెడ్ చిప్స్ కొనిచ్చినట్టు వెల్లడించాడు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు డబ్బుకూడా ఇచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. దేవేందర్‌కుమార్‌తోపాటు నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ వ్యహారంలో దీప్తి సర్నాకు పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. కిడ్నాప్ డ్రామా వెనుక ఆమె హస్తం ఏమీ లేదని తేల్చారు.అయితే ఈ వీర ప్రేమికుడి మీద దీప్తి సర్నా ఇప్పుడైనా ప్రేమ చూపిస్తుందా అంటే అదీ అనుమానమే.

Snap Deal 4

ప్రేమతో చేసినా,కోపంతో చేసినా కిడ్నాప్ అనేది నేరమే కాబట్టి మన ప్రేమికుడికి శిక్ష పడే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి మరి. ఏమౌతుందో చూడాల్సిందే. అయినా అమ్మాయి కావాలంటే పువ్వు చేతిలో పెట్టాలి గానీ స్టేషన్ ముదు ఆటోలు పెట్టటం,మెడమీద కత్తి పెట్టటం,తర్వాత బిర్యానీ, చిప్సూ పెట్టటం ఏమిటి…. సేం స్టోరీ ఏ హీరోకో చెప్పినా మరో బ్లాక్ బస్టర్ సినిమా అయ్యుండేది..

(Visited 1,001 times, 15 visits today)