Home / Latest Alajadi / జియో సిమ్ లని స్నాప్ డీల్ లో ఆర్డర్ ఇవ్వండి..! వాళ్ళు మీ ఇంటికే తెచ్చిస్తారు..!

జియో సిమ్ లని స్నాప్ డీల్ లో ఆర్డర్ ఇవ్వండి..! వాళ్ళు మీ ఇంటికే తెచ్చిస్తారు..!

Author:

“ఎప్పుడొచ్చామన్నది కాదు అన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా” అన్నట్లు మార్కెట్ లోకి ప్రవేశించిన జియో అప్పటి వరకు మార్కెట్ లీడర్లుగా ఉన్నా టెలికాం కంపనీలకు చుక్కలు చూపించింది. ఉచితంగా 4జీ ఇంటర్నెట్, కాల్స్ మరియు ఎస్ఎంఎస్లు ఇస్తుండడంతో జనాలందరూ జియో సిమ్ కార్డుల కోసం ఎగబడ్డారు. కొందరు గంటల తరపడి లైన్లలో నిలబడి సిమ్ కార్డులు సంపాదించారు. ఇప్పుడు పరిస్థితి కాస్త మెరుగై లైన్లు తగ్గాయి. మొదట డిసెంబర్ 31 వరకే అన్ని ఉచితం అని ప్రకటించినా ఇప్పుడు మళ్ళీ కొత్త సంవత్సర ఆఫర్ కిందా మార్చ్ 31 వరకు పొడగించారు. ఈ సమయంలో ఇన్నాళ్ళు షాప్ వరకు వెళ్ళి జియో సిమ్ తీసుకోలేకపోయిన వారికి ఇకనుండి వారి ఇంటికే ఉచితంగా సిమ్ కార్డులు పంపాలని జియో సంస్థ నిర్ణయించింది. అనుకుందే తడువుగా ఈకామర్స్ సంస్థ స్నాప్ డీల్ తో కలిసి వారి వెబ్ సైట్ ద్వారా జియో సిమ్ కార్డులను యూజర్లకు హోం డెలివరీ చేయనుంది.

free-jio-sim-cards

ఇకనుండి షాప్ కి వెళ్ళలేని వారు స్నాప్ డీల్ వెబ్ సైట్లోకి వెళ్లి జియో సిమ్ ని ఉచితంగా ఆర్డర్ చేసుకోవచ్చు. ఆర్డర్ చేసేటప్పుడు ఏ రోజు, ఏ టైం లో మీకు సిమ్ డెలివరి చేయాలో అన్ని వివరాలు అందించాలి. మీ ఆర్డర్ అందుకున్నాక మీకు ఓ కంఫర్మేషన్ ఎస్ఎంఎస్ వస్తుంది. అ తర్వాత మీరు చెప్పిన టైంకి స్నాప్ డీల్ వారు మీ ఇంటికి జియో సిమ్ తో వస్తారు. వారికి మీ అధార్ కార్డు మరియూ కంఫర్మేషన్ ఎస్ఎంఎస్ చూపిస్తే చాలు వారు మీ జియో సిమ్ ను వెంటనే యాక్టివేట్ చేస్తారు. ఐతే ఈ పధకాన్ని ముందుగా బెంగళూరులో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టి తర్వాత అన్ని నగరాలకు విస్తరించనున్నారు.

(Visited 434 times, 12 visits today)