Home / Inspiring Stories / సల్మాన్ ఖాన్ కేసులో కోర్ట్ తీర్పుపై దండెత్తిన సోషియల్ మీడియా

సల్మాన్ ఖాన్ కేసులో కోర్ట్ తీర్పుపై దండెత్తిన సోషియల్ మీడియా

Author:

salman

సల్మాన్ ఖాన్, తన అభిమానుల గుండెల్లోనే కాకుండా ఎల్లప్పుడు వార్తల్లోనే ఉండే పేరు. ఈ బాలీవుడ్ బాద్‌షా తన సినిమాలు, మంచి కారణాలతో ఎంత పేరు సంపాదించాడో, వివాదాలతోనూ అంతే పేరు సంపాదించుకున్నాడు. 13 సంవత్సరాల క్రితం, త్రాగి కారు నడిపి ముంబైలో ఒకరి మృతికి కారణం అయ్యాడని సల్మాన్ ఖాన్ పై ప్రధాన ఆరోపణ. ఆ కేసు అప్పటి నుండి పలు మలుపులు తిరిగి చివరికి సల్మాన్ ఖాన్ నేరం చేసాడన్నదానికి సరైన సాక్ష్యాలు లేవు అని అతనిపై ఉన్న అన్ని అభియోగాలను కోర్టు కొట్టి వేసింది. కానీ అసలు ఆ ప్రమాదానికి కారణం ఎవరు అనేది మాత్రం కోర్టు చెప్పలేకపోయింది. సరిగ్గా ఈ విషయం గురించే అసహనానికి లోనైన సామాన్య ప్రజలు సోషియల్ మీడియాలో తమ ఆక్రోషాన్ని వెల్లగక్కారు. సల్మాన్ ధోషి కానప్పుడు మరెవరు ఈ కేసులో ధోషి అని, చనిపోయిన వ్యక్తి మృతికి కారణం ఎవరని వింత వింత ప్రశ్నలు, సటైర్లతో ట్విట్టర్ బాట పట్టారు.

1

 

2

3

4

అందులో కొన్ని ట్వీట్లు ఇక్కడ చూడొచ్చు. ఏది ఏమైన సోషియల్ మీడియా బాగా పాపులర్ అయిన ఈ రోజుల్లో ప్రజలు తమ భావాలను ఏమాత్రం జంకు లేకుండా వ్యక్తికరిస్తున్నారు. ఇన్ని రోజులు మెయిన్ స్ట్రీమ్ మీడియా చానెళ్లు ఏది చెబితే అదే న్యూస్ అని నమ్మే జనాలు ఇప్పుడు సోషియల్ మీడియా ని ఫాలొ అవుతున్నారు. ఒకరు ఒక న్యూస్ రాస్తే ఆది తప్పా, ఒప్పా అనేది క్షణాలలో తెలిసిపోతుంది. తప్పు ఐతే వెంటనే కింద కామెంట్ల రూపంలో అసలు వార్తల లింక్ లు పోస్ట్ చేసే రేంజ్ కి సోషియల్ మీడియాలో ప్రజలు పెరిగిపోయారు.  మొన్న అమీర్‌ఖాన్ ఉదంతంలో కూడా అసహనంపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఎవరు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు అర్దం చేసుకొని సోషియల్ మీడియాలో రచ్చ రచ్చ చేశారు, ఆ ఎఫెక్ట్ పాపం ఈ విషయంతో ఎం సంబంధం లేని స్నాప్ డీల్ పై పడింది.

twitter

(Visited 126 times, 9 visits today)