EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / Latest Alajadi / సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు పిల్లనిచ్చేవారు తగ్గిపోయారు…!

సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు పిల్లనిచ్చేవారు తగ్గిపోయారు…!

Author:

కొన్ని సంవత్సరాల క్రితం వరకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అబ్బాయిలకి పిల్లని ఇవ్వడానికి ఆడపిల్ల తల్లిదండ్రులు పోటీ పడేవారు, లక్షల్లో వేతనాలు, విదేశీ ప్యాకెజీలు ఉంటడంతో వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు కూడా బాగా ఆసక్తి చూపించేవారు, కానీ ఇప్పుడు సీన్ మారింది, సాఫ్ట్ వేర్ అబ్బాయి అంటే పిల్లనివ్వడానికి ఎవ్వరు ముందుకు రావట్లేరు, ప్రపంచ వ్యాప్తంగా ఐటీ కంపెనీలలో భారీగా ఉద్యోగులని తొలగిస్తుండటం, అమెరికా లాంటి దేశాలు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు ఇస్తుంటడం, ఆటోమేషన్ వల్ల కూడా ఐటీ ఉద్యోగుల నియామకాలు తగ్గిపోయాయి, చాలామంది సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఎప్పుడో పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల వల్ల పెళ్లీడుకి వచ్చిన సాఫ్ట్ వేర్ అబ్బాయిలకి డిమాండ్ బాగా తగ్గిపోయింది.

సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పెళ్లి కష్టాలు

పెద్దలు కుదిర్చే సంబంధాల్లో ఐటీకి డిమాండ్ బాగా తగ్గింది. అబ్బాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అంటే.. అమ్మాయి తల్లిదండ్రులు వెనకాడుతున్నారు. ఒకప్పుడు ఐటీ ఇంజనీర్‌నే అల్లుడిగా కోరుకునేవారు.. ఇప్పుడు ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియదు కాబట్టి.. పిల్లను ఎలా ఇస్తాం అంటూ వెనుకడుగు వేస్తున్నారు. వీళ్లందరూ కూడా IAS, IPS, డాక్టర్‌, బిజినెస్‌, లెక్చరర్ అల్లుళ్ల కోసం ఆరా తీస్తున్నారు, మ్యారేజ్ బ్యూరోలు, మాట్రిమోనీ వెబ్ సైట్ లు నిర్వహించేవారు కూడా ఐటీ ఉద్యోగులకి డిమాండ్ తగ్గిపోయింది అని వెల్లడించారు.

Also Read: వివాహ సమయంలో పెళ్లి కూతురి చేతిలో కొబ్బరిబోండం ఎందుకో తెలుసా..?

భారత్‌లో అతిపెద్ద మ్యాట్రిమోనియల్‌ వెబ్‌సైట్లలో షాదీ.కామ్‌, జీవన్‌సాథి.కామ్‌ ఉన్నాయి. 2016 నుంచి ప్రతి నెలా ఐటీ ఉద్యోగికి పిల్లనిచ్చేవారు తగ్గుతూ వస్తున్నారని చెబుతున్నాయి వీరి లెక్కలు. ఈ తగ్గుదల నవంబర్‌లో 11 శాతం ఉంటే.. అది 2017 ఫిబ్రవరి నాటికి 15 శాతం తగ్గిందని వెల్లడించారు షాదీ డాట్ కామ్ సీఈవో గౌరవ్‌. ఐటీ ఉద్యోగులకు లేఆఫ్స్‌ ఇబ్బందులే కాక.. కొత్తగా పెళ్లి కష్టాలు కూడా వచ్చాయి.

Comments

comments