EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

దేవుడు నాకు అన్నీ అడ‌క్కుండానే ఇచ్చాడు.

Author:

Soggade Chinni Nayana Movie Audio Launch

కింగ్ నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ‌, లావ‌ణ్య‌త్రిపాఠి హీరో హీరోయిన్లుగా అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్ లో క‌ళ్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌క‌త్వంలో అక్కినేని నాగార్జున న‌టిస్తున్న‌ చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నా. అనూప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల కార్య‌క్ర‌మం శుక్ర‌వారం హైద‌రాబాద్ లోని శిల్ప‌క‌ళావేదిక‌లో జ‌రిగింది. ఆడియో సీడీల‌ను ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు విడుద‌ల చేసి, తొలి సీడీని నాగార్జున‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా…

కింగ్ నాగార్జున మాట్లాడుతూ “దేవుడు నాకు అన్నీ అడ‌క్కుండానే ఇచ్చాడు. వాటిలో అభిమానులు కూడా ఉన్నారు. నాన్న‌గారు అనురాగం, అత్మీయ‌త‌, అనుబంధాలు, ప‌ల్లెటూరి వాతావ‌ర‌ణం ఇలాంటి సినిమాల‌నే చేసి ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌య్యారు. అలాంటి సినిమాకు హ‌లోబ్ర‌ద‌ర్ లాంటి ఎంట‌ర్‌ట్‌న్‌మెంట్‌ను యాడ్ చేస్తే ఎలా ఉంటుందోన‌ని ఆలోచ‌న‌తో ఈ సినిమా చేశాం.అన్న‌పూర్ణ సంస్థ త‌ర‌పున మిమ్మ‌ల్ని క‌లిసి రెండు సంవ‌త్స‌రాలు అవుతుంది. మా బ్యాన‌ర్ లో మ‌నం సినిమాను చేశాం. ఆ సినిమాలో నాన్న‌, నేను అంద‌రం క‌ల‌సి న‌టించాం. మాకు దూర‌మైన నాన్న‌గారు మ‌నం సినిమాతో అంద‌రికీ ద‌గ్గ‌ర‌య్యారు. తెలుగువారికి ఇష్ట‌మైన పండుగ సంక్రాంతి. ప‌చ్చ‌ద‌నం, తియ్య‌ద‌నం అన్నీ క‌లిసి ఉంటాయి.అనూప్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. నాలుగు మచి సాంగ్స్ ఇచ్చాడు. సంక్రాంతికి వ‌స్తున్నాం… హిట్ కొడుతున్నాం“ అన్నారు.

ఈ కార్యక్రమంలో…ఎ.నాగ‌సుశీల,అమ‌ల,ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు,ర‌మ్య‌కృష్ణ ,అక్కినేని నాగ‌చైత‌న్య, ఈ సినిమా ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ్ కృష్ణ,అఖిల్ అక్కినేని,సుశాంత్,సుమంత్,అనూప్,లావణ్యత్రిపాఠి, హంసానందిని, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

(Visited 100 times, 29 visits today)

Comments

comments