Home / Inspiring Stories / నీ విజయం అంటే కేవలం నీ ఆత్మవిశ్వాసమే.

నీ విజయం అంటే కేవలం నీ ఆత్మవిశ్వాసమే.

Author:

చదువుకోవటం నేర్చుకోవటం రెండూ వేరు వేరా..? మరి ప్రకృతి నుంచి కూడా ఎన్నో నేర్చుకోవాల్సిన పిల్లలని ఎందుకని పుస్తకాలకు మాత్రమే అంకితం చేస్తున్నాం. పుస్తకాలలో ఉన్న జ్ఞానం నిజంగా పిల్లకి సరిపోతుందా? విపరీతమైన ఒత్తిడితో ఆత్మహత్యలూ,పర్సనాలిటీ డెవలప్ మెంట్ కోర్సులూ, ఆట్టిట్యూడ్ లెస్సన్స్ ఎందుకని మరింతగ అవసరం ఔతున్నాయి? పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని తినేస్తున్న ఆ బూచి ఏమిటి??? పదేళ్ళ వయస్సు కలిగిన పల్లెటూరి పిల్ల వాడు తనకన్నా 100 రెట్లు ఎత్తుండే చెట్టు ఎక్కేస్తాడు అదే సిటీ పిల్లవాడు రోజూ 10 ఫ్లొర్ల బిల్డింగ్ ఎక్కి దిగుతున్నా ఆ చెట్టెక్కటానికి భయపడతాడు ఎందుకు? మనమే పిల్లలని నేర్చుకోవటం నుంచి దూరం చేసి కేవలం చదువుకోవటం మాత్రమే “నేర్పిస్తున్నాం”…

ఈ రోజు ఉన్నత శిఖరాలని అధిరోహించిన కొందరు ఒకప్పుడు మనలా ఉన్నవారే. ఇదే మట్టి మీద ఆత్మ విశ్వాసంతో నడిచినవారే కదా… మరి వారి విజయానికి కారణం? కేవలం డబ్బుతో ఎవరూ క్రీడాకారులు కాలేరు,డబ్బు తో మంచి పాటగాడు కాలేరు వారిలో ఉన్నది కేవలం పుస్తకాల మీద ఆధారపడ్డ ఙ్ఞానం మాత్రమే కాదు ప్రకృతితో వారి అనుభందం,ఈ దేశపు నేలతో,మట్టితో వారికి ఉన్న అనుభందంతో దెబ్బలు తగిలించుకున్నారు, రక్తాలు కార్చుకున్నారు కానీ ఆత్మ విశ్వాసంతో తమ చుట్టూ ఉండే పరిసరాలతో కలిపోయి జీవితాన్ని నేర్చుకున్నారు……. ఒక సారి ఈ వీడియో చూడండి…. ఏదో..మన ఆలోచన లాంటిదే ఇంకేదో విషయం ఉందిక్కడ….

(Visited 210 times, 49 visits today)