రాజకీయాల నుండి తప్పుకుంటున్నాను – సోనియా గాంధీ

Author:

దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ సంచలన ప్రకటన చేశారు. గత 19 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతూ పదేళ్ల పాటు పార్టీని అధికారంలో ఉంచిన సోనియా గాంధీ.. తాను ఇక రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ఈరోజు ప్రకటించారు. ఇటీవలే రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ శనివారం ఆయన పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఈ ప్రకటన చేయడం రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఈరోజు ప్రారంభమైన శీతాకాల పార్లమెంటు సమావేశాలకు సోనియాగాంధీ హాజరయ్యారు. ఆ సమయంలో ఆమెని ‘రాహుల్‌ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీలో మీ పాత్ర ఎలా ఉంటుంది?’ అని ఓ విలేకరి సోనియాను ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ.. ”నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా,’ అని ప్రకటించారు.

ఆరోగ్యం సహకరించకపోవడం.. వరుసగా వైఫల్యాలు పార్టీని వెంటాడడం.. వయసు పైబటడం కూడా.. సోనియాకు ఇబ్బందిగా మారింది. దీంతో రాహుల్ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించిన వెంటనే.. రాజకీయాల నుంచి తప్పుకునేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 16వ తేదీ AICC అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు రాహుల్ గాంధీ.

(Visited 37 times, 49 visits today)