EDITION English తెలుగు
మూవీ రివ్యూ: 'పేట'   మూవీ రివ్యూ:వినయ విధేయ రామ   మూవీ రివ్యూ:యన్.టి.ఆర్‌ -కథానాయకుడు   5 రూపాయలు తీసుకొని అటే ఉడాయించి ఉంటాడు,అనుకున్న వ్యక్తికీ. సార్ మీ ఛాయ్..అన్న పిలుపుతో అతను షాక్ కు గురయ్యాడు.అసలు ఏమైందో తెలుసా..?   ఈ క్యాబ్ డ్రైవ‌ర్ రాత్రి పూట అవ‌స‌రం ఉన్న వారిని ఉచితంగా క్యాబ్‌లో ఇంటి దగ్గ‌ర దింపుతాడు. ఎందుకో తెలుసా..?   మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే మాటకు కరెక్ట్ అర్థం ఈ జంటే... వీరి కథ వింటే ఆశ్చర్యపోవాల్సిందే. రియల్ స్టోరీ..!   మూవీ రివ్యూ: పడి పడి లేచె మనసు   పొరిగింటి రెండేళ్ల చిన్నారి కోసం...చనిపోతూ ఈ తాత ఇచ్చిన విలువైన బహుమతి ఏంటో తెలుసా..?   కేంద్రం సంచలన నిర్ణయం...! ఇకపై ఆధార్ అడిగితే కోటి జరిమానా...జైలు శిక్ష! వివరాలు ఇవే!   ఎంతపెద్ద జ్వరమైనా ఈ ట్రిక్ పాటిస్తే సింపుల్ గా తగ్గిపోద్ది.! కావాల్సింది పెసరపప్పు ఒక్కటే.!
Home / Entertainment / సొంత సినిమా రిలీజ్ డేట్ మర్చిపోయిన నాని..!

సొంత సినిమా రిలీజ్ డేట్ మర్చిపోయిన నాని..!

Author:

భలె భలె మగాడివోయ్ రిలీజ్ ఎప్పుడు? మర్చిపోయాను. ఈ ప్రశ్న అడిగింది ఎవరో తెలుగు సినిమా ప్రేక్షకుడు అనుకుంటున్నారా? ఐతే మీరు పొరబడ్డారు. ఈ ప్రశ్న అడిగింది సాక్షాత్తూ ఆ సినిమా హీరో నానీ. ఈ ఏడాది ‘జెండాపై కపిరాజు’, ‘ఎవడే సుబ్రమణ్యం’ తర్వాత నాని చేస్తున్న చిత్రం ‘భలే భలే మగాడివోయ్’.ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సినిమాలో నానీ పాత్ర భయంకరమైన మతిమరపుతో ఉంటుందట.ఆ పాత్ర స్వభావాన్ని అనుకరిస్తూ పొద్దున్నె ట్విట్టర్ లో “Lol..Cheppandi plz .. #BBM release eppudu .. Marchipoya” అని పోస్ట్ చేసాడు.

గీతాఆర్ట్స్, యు.వి.క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న నాని ఈ చిత్రంపై చాలా ఆశలనే పెట్టుకున్నాడు. ‘కొత్త జంట’ తర్వాత మారుతి డైరెక్ట్ చేస్తున్న చిత్రమిది. హీరోయిన్ గా “అందాల రాక్షసి” లావణ్యా త్రిపాఠి నటిస్తోంది. భలే భలే మగాడివోయ్ నాని కెరీర్లోనే ఒక స్పెషల్ సినిమా అవనుందనీ ననీ ఇప్పటివరకూ చెయని తరహా క్యారెక్టర్లో కనిపిస్తాడనీ అంటున్నయ్ సినీ వర్గాలు.

ఇటీవ‌లే గోవాలో , హైద‌రాబాద్‌లో రెండు పాట‌లు చిత్రీకరణతో సినిమా పూర్తయ్యింది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆడియోకి మంచి స్పందన లభిస్తొంది. పాటలను బట్టి సినిమా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అయుండొచ్చు అనీ అన్న అంచనాలకు భిన్నంగా కూడా ఉండొచ్చనీ రెండురకాల వాదనలూ వినిపిస్తూ ఉన్నాయ్. నాని, లావణ్య మ‌ద్య‌లో వ‌చ్చే స‌న్నివేశాలు, నాని, న‌రేష్, వెన్నెల కిషోర్ల కాంబినేషన్ చూస్తే కామెడీ ఎలా ఉండబోతోందో ఊహించవచ్చు. మొత్తానికి ఇప్పుడు నానీ కి ఒక హిట్ కావాలి. ఇప్పటికే ఫ్లాపుల్లో ఉన్న నానీ “భలె భలే మగాడివోయ్” పై ఎక్కువ ఆశలే పెట్టుకున్నాడు. మరి నాని భలె భలే మగాడు గా నిలబడతాడా అన్నది రేపు తేలనుంది.

 

(Visited 147 times, 35 visits today)