గుండు కొట్టించుకున్నా, ఇక 10 లక్షలు రెడీ చేసుకోండి: సోను నిగమ్

Author:

ప్రముఖ బాలీవుడ్ సింగర్ “సోను నిగమ్” గత రెండు రోజులుగా వార్తల్లో నిలిస్తున్నారు. బాగా అలిసిపోయి ఇంట్లో ప్రశాంతంగా పడుకున్న తనను తెల్లవారుజామున మస్జీద్ లో పెట్టిన లౌడ్ స్పీకర్ శబ్దం మేల్కోల్పిందని, ఆ శబ్దం వల్ల ప్రశాంతంగా నిద్రపోలేక పోతున్నానని తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. అంతే అతని భావాన్ని తప్పుగా అర్దం చేసుకున్న ముస్లిం సంఘాలు అతనిపై ఎదురుదాడికి దిగాయి మస్జీద్ లో చెప్పే అజాన్ చాల పవిత్రమైనదని దాన్ని వినాలనుకోకపోవడం సోనూ దురదృష్టమని పలువురు అతనిపై ట్విట్టర్లో ఎదురుదాడి చేసారు. కోల్‌క‌తాలోని ఓ ముస్లిం మ‌త‌పెద్ద అయితే ఏకంగా ఇంకో అడుగు ముందుకేసి సోను నిగ‌మ్‌కు ఎవ‌రైతే గుండుకొట్టించి, అత‌ని మెడ‌లో పాత చెప్పుల దండ వేసి దేశ‌మంతా ఊరేగిస్తారో.. వారికి ప‌ది ల‌క్ష‌లు ఇస్తాన‌ని ఓ ఆఫ‌ర్ ప్ర‌క‌టించాడు.

Sonu Nigam shaves head asks cleric to pay Rs 10 lakh

తాను చేసిన ట్వీట్లు ఓ సామాజిక స‌మ‌స్య‌కు సంబంధించిన‌వే కానీ.. మ‌తానికి సంబంధించిన‌వి కావ‌ని చెప్పిన సోనూ త‌న వ్యాఖ్య‌ల‌ను వ‌క్రీక‌రించ‌కూడ‌ద‌ని ట్విట్టర్ లో తెలిపాడు. తను ఏ మతాన్ని కించపరచడంలేదని అధిక శబ్దం తో ఎవరూ ఇతరులను డిస్టర్బ్ చేసినా ఈ విధంగానే స్పందిస్తానని ఎంత చెప్పిన తనపై దాడి ఆగకపోవడంతో సీరియ‌స్ అయిన సోనూ ముస్లిం మ‌త‌పెద్ద చెప్పినట్లు నిన్న మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు గుండు కొట్టించుకొని మీడియా ప్రతినిధులతో మాట్లాడాడు. తనకు గుండు చేస్తే 10 లక్షలు ఇస్తానన్న ముస్లిం మతపెద్ద ప్రకటించినట్లు, ఆ 10 లక్షలు రెడీ చేసుకోవాలని తెలిపాడు. కాని తనకు కలుగుతున్న అసౌకర్యం గురించి తెలిపినందుకు కూడా ఇంతా రాద్దాంతం అవుతుందని సోను నిగమ్ కూడా ఊహించి ఉండడేమో?

(Visited 1,285 times, 50 visits today)

Comments

comments