కంటి చూపుతోనే రికార్డ్ చేసేయొచ్చు

Author:

కంటి చూపుతో చంపేస్తా అని ఒక సినిమాలో హీరో విలన్ కి వార్నింగ్ ఇస్తాడు. ఈ డైలాగ్ తో తెగ పాపులర్ అయింది సినిమా. అయితే కంటి చూపుతో చంపలేం కానీ.. మన కళ్ళముందు జరిగే ప్రతీది రికార్డు మాత్రం చేయగలం అంటోంది సోనీ సంస్థ. ఈ కంపెనీ లేటెస్టుగా తయారు చేసిన కాంటాక్ట్ లెన్సులు ధరిస్తే గనక మనం కండ్ల మందర ఏం జరిగినా వీడియో రికార్డింగ్ చేసేయొచ్చు. అంతే కాదు రీ వైండ్ చేస్కుని మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చట కూడా. నమ్మలేకపోతున్నారా.. ? మీరు నమ్మినా.. నమ్మకపోయిన ఇది నూరు శాతం నిజం అంటోంది సోనీ కంపెనీ.

sony eye lens

తమ సంస్థ.. కంటి ఐరిస్ (కనుపాప)ను ఆధారం చేసుకొని ఒక అద్భుతమైన కాంటాక్ట్ లెన్స్ ఆవిష్కరించింది. ఇదొక సూపర్ పవర్ లెన్స్. ఐరిస్ చుట్టూ ఉండే ఈ లెన్స్ లోని పీజో ఎలెక్ట్రిక్ సెన్సార్ల వల్ల వీడియో రికార్డింగ్ ఈజీ గా చేస్కోవచ్చు అని సోనీ సంస్థ వెల్లడించింది. ఈ స్మార్ట్ లెన్స్ డిజైనే అతి సూక్ష్మ మైన సెన్సార్ల ద్వారా తయారు చేసామని.. దీని ద్వారా వీడియోలను రికార్డ్ చేయడమే కాదు. వాటిని మళ్ళీ మళ్ళీ ప్లే చేయగలదని సోనీ అధికార ప్రతినిధి వివరించారు. అంతేకాదు కేవలం కనురెప్పల కదలికల ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి తో ఈ కాంటాక్ట్ లెన్స్ కి అవసరమైన శక్తిని అందించగలమట. ఈ సోనీ సూపర్ పవర్ లెన్స్ దెబ్బకి… గూగుల్, శ్యాం సంగ్ లాంటి కంపనీలు కూడా ఇలాంటి కాంటాక్ట్ లెన్స్ లను కనిపెట్టే పనిలో పడ్డాయి. దీన్ని బట్టి ముందు ముందు కెమెరాలకు కాలం చెల్లనుందన్నమాట. ఎంచక్కా మన కంటి లెన్స్ తోనే చూసినవన్నీ రికార్డ్ చేసేస్కోవచ్చు. మన మరపురాని జ్ఞాపకాలనూ కంట్లోనే భద్రపరచుకొనే రోజు త్వరలోనే రాబోతుందన్నమాట.

(Visited 232 times, 50 visits today)