Home / Reviews / సౌఖ్యం సినిమా రివ్యూ & రేటింగ్.

సౌఖ్యం సినిమా రివ్యూ & రేటింగ్.

Author:

Soukyam Movie Perfect Review and Rating

దాదాపు పదేళ్ల తర్వాత యఙ్ఞం కాంబినేషన్ అయిన డైరెక్టర్ రవికుమార్- హీరో గోపీచంద్ జంట మరోసారి రిపీట్ అయ్యింది. లేటెస్ట్‌గా గురువారం మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలిపి 700 స్క్రీన్లతో భారీ ఎత్తున రిలీజైంది ‘సౌఖ్యం’. గడిచిన రెండేళ్లుగా ఏడాదికి ఒకటి చొప్పున సైలెంట్ హిట్ కొడుతూ వస్తున్న గోపీచంద్, ‘సౌఖ్యం’తో ఈ ఏడాదికి హ్యాపీగా గుడ్ బై చెప్పాలనుకునాడు కానీ ఇది హ్యాపీ ఎండిగా కాదా అన్నది చూదాం….

కథ:

ఖాలీ గానే ఉంటూ సరదాగా తిరుగుతూ ఉండే శ్రీనివాస్ ( గోపిచంద్)కి ఒకరోజు తిరుపతి వెళ్తున్నప్పుడు అనుకోకుండా శైలజ (రెజినా) కనిపిస్తుంది. చూసిన మొదటిచూపులోనే ప్రేమలో పడతాడు . శైలజ కూడా అతన్ని ఇష్టపడినా , డైరెక్ట్ గా ఒప్పుకోకుండా ఒక షరతు పెడుతుంది. ఒక వీక్లీ లో అమ్మాయి పేరు , ఫోన్ నంబరు రాసి ఆ వీక్లీ కనుక తిరిగి నీ దగ్గరకు వస్తే అప్పుడు నిన్ను ప్రేమిస్తాను అని చెప్తుంది. ఇలా ఉండగా హైదరాబాద్ లో ఉందే ఒక రౌడీషీటర్ బాబ్జీ ( ప్రదీప్ రావత్) కొడుకుతో శ్రీను గొడవ పడతాడు,దాంతో శ్రీనును చంపాలని చూస్తూంటాడు బాబ్జి. ఈ లోపు ఆ వీక్లీ శ్రీనివాస్ కి దొరుకుతుంది . శ్రీను శైలజ ఒక గుడీలో కలుసుకుంటారు . ఇంతలో శైలజను ఆమె తండ్రి ఆమెను అక్కడ నుండి తీసుకువెళ్తాడు. బాబ్జీ ని ఎలా ఎదుర్కున్నాడు,శైలజని ఎలా పెళ్ళి చేసుకున్నాడూ అనేది తెర మీద చూడాల్సిందే..

అలజడి విశ్లేషణ:

ఒక అబ్బాయి అమ్మాయిని చూస్తాడు.. లేట్ చేయకుండా లవ్ చేసేస్తాడు. హీరోయిన్ని వెంటాడుతూ ఒక విలన్ గ్యాంగ్ ఉంటుంది.. హీరో ఒక సూపర్ మాస్టర్ ప్లాన్ వేసి అందరినీ ఒక ఇంట్లో పెట్టి విలన్ గ్యాంగ్ ని పిచ్చి పువ్వులు చేసి ఆడుకొనీ ఫైనల్ గా విలన్ వీలైతే మార్చి లేదా చితక్కొట్టి హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటాడు. మాస్ ఎంటర్ టైనర్ అంటే చాలు…. ఇదే స్టోరీ అనుకునే స్థితికి తెలుగు ప్రేక్షకుడు వచ్చేసాడు. ఇదే మూస కథని ప్రతి ఏడాది మనం ఓ 10 సినిమాల్లో అన్నా చూస్తున్నాం. అయినా ఇదే పాయింట్ ని అటు తిప్పీ ఇటు తిప్పీ మళ్ళీ మళ్ళీ చూపించేస్తున్నారు… ఇప్పుడు కూడా అదే పాత సారా ని సౌఖ్యం అనే కొత్త సీసాలో పోసి ప్రేక్షకుడి చేతిలో పెట్టాడు శ్రీధర్ సీపాన. కోనా వెంకట్-గోపీ మోహన్ అనే జంట రచయితలల పాత కథలని ఎడిట్ చేసి ఒక్కో ముక్కా కలిపి తయారు చేసినట్టున్న కథ . “సౌఖ్యం” గోపీచంద్ కెరీర్లోనే ది బెస్ట్ డిజాస్టర్ గా ఈ సినిమాని చెప్పుకోవచ్చు.కనీసం ఫైట్లూ,పాటలూ ఉంటే చాలు అనుకునే మామూలు ప్రేక్షకుడిని కూడా నిరాశ కు గురి చేసే సినిమా.ఏదో కాసేపు ఖాళీ థియేటర్ లో కూచుని ఏదైనా సినిమా చూడాలని కోరిక ఉన్న వారి బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.

నటీ నటుల పని తీరు:

కథన్నాక హీరో కావాలి, హీరోయిన్ తో పాటలకీ,విలన్ తో ఫైట్లకీ ఎవరో ఒకరు కావాలి కాబట్టి ఆ ఒకరు గోపీ చంద్ అన్నట్టు ఉంటుంది హీరో పాత్ర. అసలు హీరోలంతా తెలుగు సినిమా కమెడియన్స్. ఈ సినిమాకి పేరుకి గోపీచంద్ హీరో, కానీ ఆయనకంటే కమెడియన్స్ ని ఎక్కువ హైలైట్ చేయాలని ట్రై చేసారు. కానీ నవ్వించటం అటుంచి పరమ బోరెత్తించారు.. పృథ్వి, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, కృష్ణభగవాన్, సప్తగిరి, జయప్రకాశ్ రెడ్డి ఇలా అందరూ తమ స్తాయి పెర్ఫార్మెన్స్ లేక చతికిలబడ్డారు. ఇక గోపీచంద్ ఎప్పటిలానే తన స్టైల్ ఫైట్స్, డాన్సులు మరియు మధ్య మధ్యలో హీరోయిజం డైలాగ్స్ చెబుతూ ఎప్పటిలానే బాగానే చేసాడు. రెజీన కామెడీ టచ్ ఉన్న సీన్స్ లో ఓకే, ఇక పాటల్లో బాగా గ్లామరస్ గా కనిపించింది. హీరోకి పోటీని ఇచ్చే విలన్స్ గా ప్రదీప్ రావత్, దేవన్ లు మెప్పించలేదు. మిగతా పాత్రల్లో కనిపించిన ముఖేష్ రుషి, ప్రగతి, సురేఖ వాణి, సత్య కృష్ణ, రఘుబాబు, శివాజీ రాజా, కృష్ణ భగవాన్ లు వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు. ఇంతకంటే చెప్పటానికేం లేదు.

సాంకేతిక వర్గం పనితీరు:

మొట్ట మొదటి ఫెయిల్యూర్ కథ, తరవాత కథనం ఈ రెండింటినీ రాసిన రచయిత గారు.అంటే అన్నామంటారు గానీ ఎఎప్పుడు అప్డేట్ ఔతారో ఏమో అనిపిస్తోంది. చివరికి వీరు కామెడీ కూడా సరిగా రాసుకోలేక స్పూఫ్స్ మీద ఆధారపడడం బాధాకరం. కొన్నాళ్ళకి కామెడీ అంటే వచ్చిన తెలుగు సినిమా స్పూఫ్ లే అనుకోవాల్సి వస్తుందేమో. సినిమా స్టార్ట్ టు ఎండ్ స్క్రీన్ ప్లే గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అసలు మాట్లాడటానికి కూడా ఏం లేదు.. అందుకే సెకండాఫ్ లో స్పూఫ్ కామెడీ పెట్టి నవ్వించాలనుకొని బొక్క బోర్లా పడ్డారు. సినిమా అంతా ఇదివరకు చూసిన సినిమాల రీ మేక్ లా అనిపించి పరమ బోరింగ్ అనిపిస్తుంది. ఇక నేరేషన్ కూడా చాలా స్లోగా సాగుతున్న ఫీలింగ్ ప్రేక్షకుడి సహనానికి పరీక్షే అనుకోవాలి. దర్శకుడిగా కూడా రవికుమార్ చౌదరి ఆడియన్స్ ని ఏ కోశానా మెప్పించలేకపోయాడు.వెంకీ,రెడీ,రెబెల్ ఇలా అన్ని సినిమాలూ గుర్తుకు వస్తూనే ఉంటాయి.

సినిమాటోగ్రఫీ అనే ఒకే ఒక్క మేజర్ పాయింట్ మాత్రమే మనం ఒక సినిమా చూస్తున్నాం అనే ఫీలింగ్ తెప్పించింది.. ప్రసాద్ మూరెళ్ళ కెమెరా వర్క్ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది. ఆయన సెలక్ట్ చేసుకున్న కెమెరా యాంగిల్స్, కలర్ ఫార్మాట్, నటీనటులను చూపిన విదానం బాగుంది. వివేక్ ఆర్ట్ వర్క్ బాగుంది. గౌతమ్ రాజు ఎడిటింగ్ చేసారా లేదా అనుకుంటారు ప్రేక్షకులు. వెంకట్ యాక్షన్ ఎపిసోడ్స్ పర్లేదు ఇది సరిపోతుంది లే అనేలా ఉన్నాయి. భవ్య క్రియేషన్స్ నిర్మాణ విలువలు మాత్రం రిచ్ గా ఉంది సినిమాకి మంచి గ్రాండియర్ లుక్ ని తెచ్చాయి.

ప్లస్ పాయింట్స్:

  • సినిమాటోగ్రఫీ,
  • కెమెరా.
  • ఇంకేం లేవు

మైనస్ పాయింట్స్:

  • అతుకులబొంత కథా,
  • కథనం,
  • స్లో నేరేషన్ ,
  • డైరెక్షన్,
  • ఎడిటింగ్,
  • కామెడీ (లాంటిది కూడా కాదు) ప్రాస తప్ప పంచ్,
  • అర్థం లేని డైలాగ్స్… ఇంకా నేను చెప్పలేను…

                                                            పంచ్ లైన్: ‘సౌఖ్యం ‘ గా బయటకు రాలేరు.

(Visited 2,700 times, 63 visits today)