Home / Inspiring Stories / విషం తాగిస్తున్నారు,అన్నం పెడుతూనే చంపేస్తున్నారు.

విషం తాగిస్తున్నారు,అన్నం పెడుతూనే చంపేస్తున్నారు.

Author:

ఇన్నాళ్ళూ కల్తీ అంటే బియ్యంలో రాళ్ళూ,చక్కెరలో పట్టికా,మసాలాలో గుర్రపు లద్దెలూ,కారం పొడిలో చెక్కపొట్టూ ఇలా కొన్ని వస్తువులూ అనే అనుకునే వాళ్ళు ఐతే కల్తీ రాకసులు తమ కోరలని చాస్తూనే ఉన్నారు ఎలా వీలైతే అలా ఎంత వీలైతే అంతా కల్తీ చేస్తూనే ఉన్నారు కల్తీకి వీలు లేదు అనుకునే వస్తువులనూ మన దిమ్మ తిరిగే పద్దతుల్లో కల్తీ చేసి డబ్బు కోసం ఎంత చేయగలరో అంతా చేస్తున్నారు… ఈ కల్తీలపై  Alajadi.com ప్రత్యేక కథనం…

పాలు: చాయ్..! ప్రతి మనిషీ తెలియకుండానే లోనైన ఒక మథురమైన వ్యసనం. ఒక్కోగుక్కా గొంతులోకి దిగుతూంటే శరీరమంతా రెఫ్రెష్ అయినట్టున్న ఫీలింగ్ ఎన్ని ఆల్కహాలిక్ బేవరేజెస్ తాగినా రాదనేది చాయ్ ప్రియుల మాట. ఒక్క రోజులోనిఏ కనీసం 80 వేల లీటర్ల పాలను రకరకాల పద్దతుల్లో జంటనగరాల ప్రజలు వినియోగిస్తున్నారు. కానీ ఒక్కో గుక్కా మిమ్మల్ని మరణానికి చేరువ చేస్తోంది తాగే టీ,కాఫీ,పాలూ మిమ్మల్ని ఒక్కో క్షణం భయంకర రోగాలకు దగ్గర చేస్తున్నాయి. బీబీనగర్ మక్తా అనంతారం ప్రాంతానికి చెందిన భక్త రవిఅక్కడ నాగార్జున యూరియా, సన్‌ఫ్లవర్ నూనె, మిల్క్‌పౌడర్‌లను నీళ్ళతో కలిపి కృతిమ పాలను తయారు చేస్తున్నాడు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు గ్లాసు పల్లినూనె, గ్లాసు నాగార్జున యూరియా, మిల్క్ పౌడర్‌ను మిక్సీలో వేసి రుబ్బుతారు. తర్వాత ఆ మిశ్రమాన్ని నీళ్ళలో కలిపి 400 లీటర్ల పాలను తయారు చేస్తాడు. ఈ పాలు స్వచ్ఛమైన గెదె పాలంటూ నమ్మిస్తూ లీటర్‌కు రూ.40 చొప్పున ఘట్‌కేసర్ నుంచి సికింద్రాబాద్ వరకు ఉన్న టీస్టాల్స్, బండి మీద ఉండే టీ పాయింట్‌లు, చిన్న చిన్న స్వీటు షాపులకు సరఫరా చేస్తున్నారు.

fake milk production hyderabad

యూరియా మీ రక్తాన్ని కొద్ది కొద్దిగా పలుచన చేస్తుంది రక్తకణాల ఉత్పత్తినీ తగ్గిపోయేలా చేస్తుంది. ధీర్ఘ కాలం లో నాడీ మండలం మీదా ప్రభావం చూపుతుంది. ఒక్క సారి రోజూ పాలు తాగే మన పిల్లలు గుర్తొస్తే గుండే వణుకుతోంది కదూ….

 

ఫేక్ రైస్: చైనా రైస్ గా పిలవబడే ఈ బియ్యం హైదరాబాద్ లోనూ విచ్చలవిడిగా వాడుతున్నారు.ఎగ్ ఫ్రైడ్ రైస్ పేరుతో నగరం లోని ప్రధాన కూడళ్ళ లోని రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ ఇదే రైస్ ని వాడుతున్నాయి.ఇప్పుడు భారతీయ మార్కెట్లోకి అడుగు పెట్టిన కల్తీ రైస్ ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లలో మన ప్లేట్ లో సర్వ్ చేయబడుతోంది… బంగాళా దుంప, చిలకడ దుంపల పౌడర్ లో ప్లాస్టిక్ ని కలిపి అచ్చుల్లో పోసి ఈ ఫేక్ రైస్ ని మన మార్కెట్లో వదులుతున్నారు. చైనాలో ఈ రకం బియ్యం, ఫేక్ గుడ్లూ మరీ సీక్రేట్ గా ఏమీ తయారవటం లేదు పెద్ద ఎత్తున ఫ్యాక్టరీలని పెట్టి మరీ ఈ రైస్ ని తయారు చేస్తున్నారు.

Fake Rice

వీటిని తయారు చేయటానికి వాడే భయంకర రసాయనల వల్ల ఇప్పుడు ఆరోగ్యం దెబ్బతినటమే కాదు ముందు తరాల పైనా వీటి దుష్ప్రభావం ఉంటుందని అంటున్నారు డాక్టర్లు. ఈ రసాయనల ప్రభావం మెదడూ మరియూ నాడీ వ్యవస్తలని దెబ్బతీస్తోందట. కాబట్టి ఆహారం విషయంలో జాగ్రత్తగ ఉండాలనీ ఫాస్ట్ ఫుడ్ ల మీదా, నాసిరకం కూరగాయల మీదా ఆధారపడ వద్దని సలహా ఇస్తున్నారు.ఈ విష రసాయన బియ్యాన్ని భారత్ కి ఎగుమతి చేస్తున్నారు. ఈ విషయం కస్టమ్స్ అధికారులకు తెలిసినా ఎందుకు అనుమతిస్తున్నారో అర్థం కావటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి…

 

పప్పులు: పాలిష్డ్ అని మీరు కొనే ప్రతీ పప్పు మీదా మెరుపు కోసం వాడిన రసాయన పదార్థాలుంటున్నయ్ చిన్న రెస్టారెంట్లలో వాడే పప్పులు గోడౌన్లలో పాడైన వేస్టేజ్ నుంచె తెస్తున్నారు,

Polished dal

 

మాంసం: కోళ్ళ ఫారం లో చనిపోయిన కోళ్ళు బిర్యానీ లో కి వస్తున్నాయ్,ఆహారం గా నిషేదించిన క్యాట్ ఫిష్ వందిన తర్వాత వేరే చేప పేరుతో మీ ప్లేట్ లో సర్వ్ చేయబడుతోంది.. రోగాలతో చనిపోయే గొర్రెలూ,మేకలూ మాంసవిక్రయ శాలల్లో మనలని మింగేయటానికి చూస్తున్నాయి…

పళ్ళూ,కూరగాయలు: మంచి రంగు చూడగానే ఒక యాపిల్ నోరూరిస్తుంది “రోజుకో ఆపిల్ తింటే డాక్టర్ అవసరమే ఉండదన్న” మాటా గుర్తొస్తుంది. 10-20 రూపాయల ధరతో ఒక యాపిల్ ని కొంటారు ఐతే మీరు తినేది పోషకాహారం కాదు విషం. యాపిల్స్ మంచి రంగులో కనిపించటానికి వాటిపై వ్యాక్స్ పూస్తున్నారు. చౌక బారు యాపిల్ ని కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవటానికి విషపూరిత రసాయన పూత వేస్తున్నారు. పుచ్చకాయలు ఎర్ర గా కనిపించ టానికి రంగుకలిపిన రసాయణాలని (వీటిలో కొన్ని క్యాన్సర్ పేషంట్లకు ఇచ్చే డ్రగ్స్ ఇవి ఎక్స్పైరీ డేట్ ఐపోయినవి) ఇంజెక్ట్ చేస్తున్నారు.

Apples

 

షుగర్ లెస్ స్వీట్లలో శాకరిన్ ఎక్కువ కలుపుతున్నారు.. కూర గాయలు మంచి రంగులో కనిపించటానికి వాటిని కృత్రిమ రంగులలో నాన బెడుతున్నారు. జ్యూస్ లలో కలిపే ఐస్ మార్చురీ వేస్టేజ్,యియర్ బడ్స్ కి వాడే దూది కూడా హాస్పిటల్ వేస్టేజ్ నుంచే సేకరిస్తున్నారు… కబేళాలలో కొవ్వునీ,చచ్చిన జంతు కళేబరాల నుంచి సేకరినచిన ఎముకల ద్రావణాన్నీ వంట నూనెల్లో వాడుతున్నారు…. ఇవన్నీ పేపర్లలో చూసి ఎక్కడో జరుగుతోంది అనుకుంటున్నాం గానీ… ప్రతీరోజూ మనమూ బాదితులమే అన్న విశయం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

(Visited 530 times, 78 visits today)