EDITION English తెలుగు
ఈ రోజు: 18-10-2018 (గురువారం) చమురు ధరలు..! పెట్రోల్ ధర ఎంత ఉందో చూడండి.! డీజిలు ధర ?   ఈ రోజు: 18-10-2018 (గురువారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   సుప్రీం మరోకీలక నిర్ణయం: వెంటనే డైవర్స్ తీసుకోవచ్చు   రెండు వారాల్లోనే హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ…ఐదుగురు మృతి   ఈ రోజు: 17-10-2018 (బుధవారం) రాశిఫలాలు..! ఏ రాశివారికి ఎలా ఉందో చూడండి.! ఎవరికి బాగుందంటే.?   హాస్పిటల్స్‌లో రోగుల ప‌క్క‌నే ఉంచే హార్ట్ బీట్ మెషిన్‌ను ఏమ‌ని పిలుస్తారో, అందులో రీడింగ్స్‌ను ఎలా చ‌ద‌వాలో తెలుసా..?   ఆరోగ్యం,భోజ‌నం, చ‌దువు, అంతా…..ఈ వాత్స‌ల్యం సంస్థే అండ‌గా నిల‌బ‌డ‌తుది   'తిత్లీ' బాధితులకు సంపూర్ణేష్ బాబు, విజయ్ దేవరకొండ, తారక్‌, కల్యాణ్‌రామ్‌ సాయం   మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం చివరిసారి చెప్పిన కథ.... తప్పక చదవండి.   కొన్ని యూట్యూబ్‌ చానెళ్లపై గీతామాధురి సీరియస్‌ వార్నింగ్‌

స్పెషల్ స్టేటస్ కోసం పవర్ స్టార్ ఫార్ములా!

Author:

సముద్రం ఒకడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు, తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు, పర్వతంఎవ్వడికి ఒంగి సలామ్ చెయ్యదు …నిజమే…పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఇది అతికినట్టు సరిపోతుంది….ఓషన్, తుఫాన్, మౌంటెన్ కలిస్తే పవన్ కల్యాణ్ అవుతాయి అనే విషయం ఆయనకన్నా ఆయన అభిమానులకు ఎక్కువగా తెలుసు…ఓషన్ కు ఎమోషన్స్, తుఫాన్ కి అలజడి, మౌంటెన్స్ కి అవసరమైతే ఎగరడం నేర్పగల నేర్పరితనమూ ఆయనకున్నాయని తెలుసు..కానీ…ఎక్కడో చిన్న గ్యాప్..ఆయనకీ…చంద్రబాబు నాయుడికీ మధ్య! అమరావతి పేరిట అరచేతిలో స్వర్గం చూపిస్తున్న చంద్రబాబు టీం కి కంట్లో నలుసులా మారిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అబ్జర్వ్ చేయటం తో పాటు, ఆయన ట్విట్టర్ కామెంట్స్ బ్రౌజ్ చేయటం..తెలుగుదేశం నాయకుల దినచర్యగా మారిపోయిందనటంలో అతిశయోక్తి లేదేమో…ఏ పీ క్యాబినెట్ మీట్ జరుగుతుంటే..భూసేకరణ మీద ఈ `తమ్ముడు’ ఏమి ట్వీట్ చేస్తున్నాడో తెలుసుకోవటానికే మంత్రులు మొబైల్స్ తో బిజీగా ఉంటున్నట్టు సమాచారం.

పవన్ కళ్యాణ్ తెలివితేటలను అండర్  ఎస్టిమేట్ చేసే యనమల రామకృష్ణుడు లాంటి తెదేపా సీనియర్లకు ఈ రోజు – పవర్ స్టార్ పక్కలో బల్లెం లా మారాడనే టాక్ వినిపిస్తోంది. అనవసరమైన కామెంట్స్ చేస్తే..అత్యవసరంగా వివరణ ఇచ్చుకునే పరిస్థితి దాపురిస్తుందనే నగ్న సత్యాన్ని మురళీ మోహన్ లాంటి వెనుకటి తరం హీరోలకు కూడా చూపించగల నేర్పరితనం పవన్ కళ్యాణ్ సొంతం అనేది కూడా ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయింది.

అందాకా ఎందుకు…నిన్నటికి నిన్న ప్రధాని మోడీ కి పరిస్థితి ని పూర్తిగా స్వయంగా రాష్ట్ర విభజన సమయంలోనే  వివరించాననిన్నీ, ప్రజల మనసులకు అయిన గాయం గురించి ఆయన సమగ్రంగా అర్ధం చేసుకున్నారనిన్నీ చేసిన ట్వీట్ లో చాలా సూటిగా నే మోడీ సర్కార్ మీద పవర్ స్టార్  తన వైఖరిని ప్రకటించేశారు. ఇప్పటికె ఆలస్యం అయిన విషయం వాస్తవం అయినప్పటికీ…ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటుందనే భావిస్తున్నట్టు కూడా పవన్ ప్రకటించారు. దేశ సమగ్రతని సృష్టిలో పెట్టుకుని ఇంకొంత కాలం వేచి చూద్దామనీ, అప్పటికీ కాకపోతే ఎలా ముందుకెళ్లాలో..ప్రత్యేక హోదాని ఎలా సాధించుకోవాలో ఆలోచిద్దామనీ పవర్ స్టార్ చెప్పటం వెనుక కచ్చితంగా ఆయన కొత్త ఫార్ములా తో సిద్ధంగా ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. వినేవాడు అమాయకుడు అయితే….చెప్పేవాడు వేదాంతి అనే సామెత చాలా ఓల్డ్ ఫ్యాషన్ ప్రావెర్బ్ అనీ, వింటున్నాం కదా అని చెపుతూ పోతే ఉప్పెనలా విరుచుకుపడుతాననీ పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారా…?, అనే సందేహమూ జనంలో లేకపోలేదు.పవర్ స్టార్ ట్విట్టర్ స్టార్ కాదనీ….జనసేన జవాసత్వాలుడిగిన సేన కాదనీ, జనచేతన ముందు ఎంతటివారైనా తల వంచాల్సిందేననీ అంటున్న పవర్ స్టార్ మాటలకు మోడీ కానీ, చంద్రబాబు కానీ…లేదా వారిద్దరి పరివారం కానీ ఏ రకంగా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి మరి! తమ్ముడే గదా అని చులకన చేస్తే…గబ్బర్ సింగ్ లా చెడుగుడు ఆడేయటానికి సిద్ధంగా ఉన్న పవర్ స్టార్ తో నరేంద్ర మోడీ ఏ రకంగా డీల్ చేస్తారనేది అటు బీ జె పీ లోనూ, ఇటు తెదేపా లోనూ ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న అంశం !

(Visited 83 times, 26 visits today)