Home / Latest Alajadi / ముగ్గురి ప్రాణాలు కాపాడి చేతులు, కాలు పోగొట్టుకున్నాడు…ఇప్పుడు అత్యంత దీనస్థితిలో ఉన్నాడు.

ముగ్గురి ప్రాణాలు కాపాడి చేతులు, కాలు పోగొట్టుకున్నాడు…ఇప్పుడు అత్యంత దీనస్థితిలో ఉన్నాడు.

Author:

రియాజ్ అహమ్మద్ ఈ పేరు 1996 ప్రాంతం లో భారత దేశం మొత్తం మారు మోగి పోయింది. అప్పటికి అతని వయస్సు 8 సంవత్సరాలు. ఆ వయస్సులోనే అతనికి అంత పాపులారిటీ ఎందుకు వచ్చిందీ అంటే ఆ బాలుడు ఏకంగా ముగ్గురి ప్రాణాల‌ను కాపాడాడు. కానీ ఆ సంఘ‌ట‌న‌లో త‌న రెండు చేతులు, ఒక కాలును కోల్పోయాడు. అత్యంత ధైర్య సాహ‌సాల‌ను ప్ర‌దర్శించి ముగ్గురిని కాపాడినందుకు అత‌ను బ్రేవ‌రీ అవార్డును కూడా అందుకున్నాడు. అయితే గ‌తం ఇప్పుడు అత్యంత దీనావ‌స్థ‌లో దుర్భ‌ర‌మైన జీవితాన్ని అత‌ను గ‌డుపుతున్నాడు.

ఇప్పుడు రియాజ్ అహ్మ‌ద్‌. వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు. కానీ ఇప్పుడు మాత్రం అతని అత్యంత దయనీయ మైన స్థితిలో ఉన్నాడు. ఇతనిది ఉత్త‌ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ల‌క్నో. అక్క‌డి తెలిబాగ్ అనే ఏరియాలో నివాసం ఉండేవాడు. ఇత‌ను అక్టోబ‌ర్ 10, 1996న జ‌న్మించాడు. ఇత‌ని తండ్రి చిరు వ్యాపారి. తోపుడు బండిపై కోడిగుడ్ల‌ను విక్ర‌యిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇక రియాజ్ కుటుంబంలో మొత్తం 8 మంది ఉండేవారు. తల్లి, తండ్రితోపాటు రియాల్ అన్న‌, త‌మ్ముళ్లు, అక్కలు, చెల్లెల్లు క‌లిసి మొత్తం 6 మంది ఉండేవారు. రియాజ్ రెండోవాడు. అయితే 2003వ సంవ‌త్స‌రంలో రియాజ్‌కు అప్పుడు 8 సంవ‌త్స‌రాల వ‌యస్సు ఉండ‌గా ఓ రోజున ఓ సంఘ‌ట‌న జ‌రిగింది. అదేమిటంటే…

riyaz ahmed bravery award

లక్నో లోని ద‌లిగంజ్ అనే ప్రాంతం లో ఉన్న ఒక క్రాసింగ్ వ‌ద్ద ఓ బాలిక రైల్వే ట్రాక్ దాటుతుండ‌గా రియాజ్ గ‌మ‌నించాడు. ముందు తండ్రి న‌డుస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎదురుగా ట్రైన్ వ‌స్తోంది. దీంతో రియాజ్ ట్రెయిన్ వ‌స్తుంద‌ని ఆ బాలిక తండ్రికి చెప్పాడు. అయినా అత‌ను ప‌ట్టించుకోలేదు. దీంతో ట్రెయిన్ ద‌గ్గ‌ర‌గా వ‌చ్చింది. మ‌రో వైపు ఆ బాలిక కాలు రైలు ప‌ట్టాల్లో ఇరుక్కుపోయింది. అది చూసిన వెంట‌నే రియాజ్‌తోపాటు ప‌క్క‌నే ఉన్న మ‌రో బాలుడు ప‌రిగెత్తుకుని ఆ బాలిక ద‌గ్గ‌ర‌కు వెళ్లారు. ఆ బాలిక తండ్రి కూడా ఆమె వ‌ద్ద‌కు వెళ్లాడు. ఈ క్ర‌మంలోనే ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన ట్రెయిన్‌ను చూసి రియాజ్ ఆ బాలిక‌ను ఎత్తుకుని దూరంగా విసిరాడు. ఆ బాలిక తండ్రితోపాటు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చిన మ‌రో బాలున్ని కూడా అత‌ను దూరంగా నెట్టేశాడు. కానీ అప్ప‌టికే అత‌ను ట్రెయిన్ కింద ప‌డ్డాడు. దీంతో ఆ ప్ర‌మాదంలో రియాజ్‌కు రెండు చేతులతోపాటు ఒక కాలు పూర్తిగా పోయింది. అయినా రియాజ్ ముగ్గురి ప్రాణాల‌ను కాపాడాడు.

riyaz ahmed bravery award

అతికష్టం మీద రియాజ్ ప్రాణాలను నిలబెట్టారు డాక్టర్లు. 8 సంవత్సరాల పసి వయస్సులోనే రియాజ్ చేసిన ఆ సాహసానికి గానూ అతను “సాహస బాలల” అవార్డుకు ఎంపికయ్యాడు. రియాజ్‌కు అప్ప‌టి భార‌త రాష్ట్ర‌ప‌తి డాక్ట‌ర్ ఏపీజే అబ్దుల్ క‌లాం చేతుల మీదుగా జ‌న‌వ‌రి 24, 2003న సంజ‌య్ చోప్రా నేష‌న‌ల్ బ్రేవ‌రీ అవార్డు ల‌భించింది. ఆ తరువాత అప్ప‌టి ప్ర‌ధాని వాజ్‌పేయి చేతుల మీదుగా రియాజ్ సాహస బాల‌ల‌కు ఇచ్చే అవార్డును ఢిల్లీలో అందుకున్నాడు. దీంతోపాటు మారిష‌స్ ప్రెసిడెంట్ గ్రేట్ హీరోస్ గ్లోబ‌ల్ బ్రేవ‌రీ అవార్డును రియాజ్‌కు అంద‌జేశారు. అయితే అప్ప‌టి నుంచి రియాజ్ త‌న‌కున్న ఒకే కాలుతో రాయ‌డం మొద‌లు పెట్టాడు. అందులో భాగంగానే తాజాగా జ‌రిగిన బోర్డు ప‌రీక్ష‌ల్లో కాలితో ఎగ్జామ్ రాసి పాస‌య్యాడు. కాలేజీలో చేరాడు. అయితే ఇప్పుడు అత‌ని కుటుంబ ఆర్థిక ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారింది. పూట గ‌డ‌వ‌డ‌మే క‌ష్టంగా ఉంది. అతని చదువూ ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. అంతటి సాహస వంతుడు కూడా ఇప్పుడు నిస్సహాయంగా తననీ, తన కుటుంబాన్నీ ఆదుకునే వారికోసం ఎదురు చూస్తున్నాడు.

(Visited 237 times, 37 visits today)