Home / Entertainment / Video: అంచనాలను మించిన స్పైడర్ మూవీ టీజర్.

Video: అంచనాలను మించిన స్పైడర్ మూవీ టీజర్.

Author:

ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌బాబు నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’. సినీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ చిత్ర టీజర్‌ని హీరో మహేశ్‌బాబు ఈరోజు ట్విటర్‌లో విడుదల చేశారు. మహేశ్ బాబు గూఢాచారిగా నటిస్తున్న ఈ టీజర్‌ ఒక రొబొటిక్‌ సాలీడు నడుస్తున్న సన్నివేశంతో మొదలయ్యింది. అలా పాకుతూ కంప్యూటర్ ముందు పని చేసుకుంటున్న మహేశ్‌ భుజం మీదకు చేరుతుంది. అలా చేరిన ఆ స్పైడర్‌ మహేశ్ సౌండ్ తో ఆపడం హైలైట్‌గా నిలిచింది. అన్నింటికి మించి మహేశ్ లూక్, వెనక కంప్యూటర్ల సెటప్ సూపర్ గా ఉండి ఈ టీజర్ అభిమానుల అంచనాలకు మించి ఉంది.

ఇక ఈ సినిమాలో మహేశ్‌కి జోడీగా రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటిస్తోంది. ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ దసరాకి తెలుగు, తమిళంలో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ‘స్పైడర్‌’ సినిమాకు హరీస్ జయరాజ్ సంగీతం సమకూర్చితుండగా, ఎస్.జే. సూర్య ఒక ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడు.

(Visited 631 times, 29 visits today)