EDITION English తెలుగు
స్కూల్ కి రావట్లేదని అడిగినందుకు.. ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన స్టూడెంట్.   షాకింగ్ న్యూస్: మూతపడిన ట్రంప్ ప్రభుత్వం, సంక్షోభంలో అమెరికా...!   Video: మెట్రో నుంచి రోడ్ మీద వెళ్తున్న కారులో దిగబడిన రాడ్.   క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారి.. సాయం అందించాలనుకునే వారు అకౌంట్ నం. 80808080101026419 లో డబ్బులు వేయండి.   డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!   Video:స్కూల్ కి పది నిముషాలు లేట్ గా వచ్చాడని.. బాతులా నడిపించి..బలి తీసుకున్నారు.   పెద్ద పెద్ద క్రేన్లు ఆ హనుమాన్ విగ్రహాన్ని ఇంచుకూడా కదలించలేక పోయాయి.   బంపర్ ఆఫర్: కేవలం రూ.99 కే విమానం టిక్కెట్   ఆమె భర్త ఏది కావాలంటే తెచ్చిచ్చేవాడు, ప్రేమగా చూసుకునేవాడు..! అయిన ఆ భార్య విడాకులు కోరింది, ఎందుకో తెలుసా..?   టెన్త్ విద్యార్హతతో డిగ్రీ చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే మంచి అవకాశం..!
Home / Inspiring Stories / శ్రీకారం – మనల్ని ఆలోజింపచేసే అద్భుతమైన షార్ట్ ఫిలిం.

శ్రీకారం – మనల్ని ఆలోజింపచేసే అద్భుతమైన షార్ట్ ఫిలిం.

Author:

ప్రతిరోజు మనం ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చూస్తుంటాం, అందులో చాలా వరకు కామెడీ లేదా లవ్ కి సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి, షార్ట్ ఫిలిమ్స్ యే కాదు సినిమాలు కూడా లవ్, కామెడీ చుట్టూనే తిరుగుతాయి, మన చుట్టూ ఉన్న సమాజంలోని ప్రజలు ఎదుర్కునే సమస్యలని,భాదలని చూపెడుతూ, వాటికీ ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించే విధంగా ప్రేరేపించే సినిమాలు, షార్ట్ ఫిలిమ్స్ చాలా తక్కువగా వస్తాయి, వాటిలో శ్రీకారం అనే షార్ట్ ఫిలిం ఒకటి.

MR Productions బ్యానర్ పై కిశోరుడు అనే యువకుడు తీసిన ఈ షార్ట్ ఫిలిం ఇప్పుడు అందరి మన్ననలు పొందుతుంది, ఉన్నత చదువులు చదివి, చేస్తున్న ఉద్యోగంలో కూడా ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి, రైతుల సమస్యలకి చలించిపోయి వ్యవసాయం చేయాలనీ అనుకుంటాడు, ఆ క్రమంలో అతనికి ఎదురైన కష్టాలు, వాటినన్నింటిని దాటుకుని అతడు విజయం సాధించాడా? లేదా? అన్నది మిగిలిన కథ.

దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న సైనికులు మనకి ఎంత ముఖ్యమో, మనం ప్రతిరోజూ తినే తిండిని పండిస్తున్న రైతులు కూడా అంతే ముఖ్యం, కానీ ఆ రైతులకి సైనికులలాగా నెల నెల జీతాలు, పండుగ బోనస్ లు ఉండవు, వారు ఎంతో కష్టపడి పండించిన పంటకి సరైన ధరలేక, ధర ఉన్న దళారుల మోసాల వల్ల సరైన ధరకి అమ్ముకోలేక , బ్యాంకుల అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఒకప్పుడు 20 ఎకరాలలో పంటలు పండించిన రైతులు ఇప్పుడు కూలి పనులు చేస్తున్నారు, రైతుల జీవితం బాగుంటేనే దేశం బాగుంటుంది, పంటలని పండించే వారే లేకపోతె మనం తినడానికి తిండి దొరకదు, అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అందరు రైతుల పరిస్థితి గురుంచి ఆలోచించాలి.

మన దేశంలో అన్ని రంగాలు కొత్త కొత్త సంస్కరణలతో, ఆధునిక పద్దతులతో ముందుకు పోతున్నాయి, కానీ వ్యవసాయ రంగం మాత్రం ఇప్పటికి పాత పద్దతిలోనే ఉంది , వ్యవసాయ రంగంలో ఆధునిక పద్ధతులని ప్రవేశపెట్టాల్సిన అవసరం చాలా ఉంది, మన దేశంలో ఇప్పుడున్న యువతలో ఎవరు వ్యవసాయరంగంలోకి రావట్లేరు, వ్యవసాయరసంగం అభివృద్ధి చెంది రైతుల కుటుంబాలు బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది.

కిశోరుడు తీసిన ఈ ” శ్రీకారం ” షార్ట్ ఫిలింలో దేశానికి అన్నం పెట్టే రైతుల పరిస్థితి ఎలా ఉంటుందో చూపించాడు, రైతుల జీవితాలని అభివృద్ధి వైపు తీసుకెళ్లేందుకు యువతరం ఎలా ఆలోచించాలి అనేది కూడా చూపించారు, చేస్తున్న ఉద్యోగాలు ఆపేసి వ్యవసాయం చేయాలనీ ఆలోచిస్తున్న వారికి ఆదర్శంగా ఉండేలా ఈ లఘుచిత్రాన్ని తీశారు, ఇంత అద్భుతమైన లఘుచిత్రాన్ని తీసిన కిశోరుడుని మనం ఖచ్చితంగా అభినందించాల్సిందే.

Comments

comments