Home / Entertainment / శ్రీదేవి కి కట్ చెప్పిన “పులి”

శ్రీదేవి కి కట్ చెప్పిన “పులి”

Author:

రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి కి మొదట్లోనే అవాంతరం ఎదురయింది.. ఇంగ్లీష్ వింగ్లీష్, తర్వాత కోలీవుడ్ సోషియో ఫాంటసీ సినిమా పులి లో రాణి పాత్ర లో శ్రీదేవి నటిస్తోంది అన్న విసయం తెలిసిందే.అయితే ఈ సినిమాలో నటించేందుకు డబ్బింగ్ చెప్పేందుకు భారీ రెమ్యునరేషన్ తీసుకుందని వార్తలొచ్చాయి. ఐతే అదే ఆమెకి కొత్త ఇబ్బందులు తెచ్చిందట. బాహుబలి వద్దనుకుని పులికి ఓకే చెప్పేసిన శ్రీదేవి సరైన మూల్యమే చెల్లించుకుందంటున్నారు కోలీవుడ్ జనాలు.

బాహు బలి లో కీలకమైన శివగామి పాత్ర కోసం రాజమౌళి ముందు గా శ్రీ దేవినే అడిగార్త కానీ కారణాలేమిటో తెలియదు గానీ శ్రీదేవి ఆ పాత్రని తిరస్కరించింది. అదే సమయం లో ఈ పాత తరం అతిలోక సుందరి తమిళం లో కుర్ర హీరో విజయ్ తో నిర్మిస్తున్న సినిమా ‘పులి’ కోసం వెంటనే చాలా రోజులు డేట్లిచ్చి  ఎంతో ఇష్టంగా సినిమా పూర్తి చేసింది. దీనికిగానూ కొట్లలో రెమ్యునరేషన్ తీస్కుందట. ఐతే ఆ అక్కసుతోనే ఆ సినిమా దర్శకుడు తన పాత్రను తగ్గించాడని సన్నిహితుల దగ్గర వాపోందట ఈ పదహారేళ్ల వయసు హీరోయిన్.

ఇంతకీ విషయమేంటంటే భారీ సోషియో ఫ్యాంటసీ చిత్రం లో రాణీ పాత్రలో ఉండే పాత్ర సినిమాకి హైలెట్ అని చెప్పారట కానీ తీరా డబ్బింగ్ సమయంలో ఫైనల్ వెర్షన్ చూస్తే శ్రీదేవికి దిమ్మదిరిగి పోయినట్లు సమాచారం. దర్శకుడు చింబుదేవన్ కథ చెప్పేటపుడు శ్రీదేవి పాత్ర గురించి చాలా చెప్పాడట. అలా చెప్పినట్లే శ్రీదేవి మీద చాలా సన్నివేశాలు కూడా చిత్రీకరించారట.

కానీ తీరా డబ్బింగ్ చెప్పడానికి వెళ్ళిన శ్రీదేవి కి తన పాత్ర చాలా తగ్గిపోయిందని అర్థమై. అదే విషయం దర్షకున్ని అడిగితే. లెంగ్త్
ఎక్కువై పోతుండటంతో ఎడిటింగ్‌లో భాగంగా శ్రీదేవి నటించిన చాలా సన్నివేశాలకు కట్ చేసి పాత్రను బాగా కుదించేసినట్లు తెలిసింది. దీంతో శ్రీదేవి కి పిచ్చి కోపం వచ్చి  ఈ విషయంలో దర్శకుడితో ఆమె గొడవ కూడా పడిందట. ఐతే లెంగ్త్ సమస్య గురించి చెప్పి కన్విన్స్ చేసిన చింబు దేవన్ ఎలా గోలా శ్రీదేవి తోనే డబ్బింగ్ చెప్పించారట.

ఐతే శ్రీదేవి మాత్రం దర్శకుడి మీద కోపంగానే ఉన్నారనీ ఆయన సమాధానం సంతృప్తిగా అనిపించలేదనీ, చాలా కోపంగా డబ్బింగ్ స్టూడియో నుంచి వెళ్లిపోయిందని కోలీవుడ్ వర్గాల సమాచారం. అసలే తాను వద్దన్న శివగామి పాత్రతో రమ్యకృష్ణ దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించేసింది. మరో వైపు ఎన్నొ ఆశలు పెట్టుకున్న  ‘పులి’లో తన పాత్ర గురించి ఏడుస్తోంది శ్రీదేవి. అసలే శివగామి క్యారెక్టర్ వదులుకున్నానే అనే బాధలో ఉంటే ఈప్పుడీ కొత్త షాక్ శ్రీదేవి ని ఇంకా బాదపెడుతూన్నట్టే ఉంది.

(Visited 49 times, 8 visits today)