Home / Inspiring Stories / అర ఎకరంలో 3 వేల కేజీల వరి పండించి రికార్డు సృష్టించిన పంతులమ్మ.

అర ఎకరంలో 3 వేల కేజీల వరి పండించి రికార్డు సృష్టించిన పంతులమ్మ.

Author:

SRI technique adopted by this teacher

ఆమె పిల్లలకు పాటాలు చెప్పే ఉపాధ్యాయురాలు ఒక కొత్త సెలబస్ వస్తే వాటిని చదివి అర్థం చేసుకొని వాటిని పిల్లలకు అర్థం అయ్యే విధంగా వివరించి చెప్పవలసి ఉంటుంది. కానీ ఈ ఉపాధ్యాయురాలు నిత్యం తాను నేర్చుకుంటూ భూతల్లి అండతో వ్యవసాయంలో అరెకరంలో 3,223 కేజీల వరి పండించి రికార్డు సృష్టించింది. ఆమె తమిళనాడుకు చెందిన ప్రసన్న. ఈమె స్కూల్ కి వెళ్తే భౌతిక శాస్త్రం ఎంత చక్కగా చెబుతుందో.. పొలానికెళితే ‘శ్రీ’ వరి సాగుని అంతే చక్కగా చేపడుతుంది. ప్రసన్నకు చిన్నతనం నుండి ప్రయోగాలు అంటే చాలా ఇష్టం అలాగే పచ్చని పైరు అంటే ఇంకా ఇష్టం ఆ ఇష్టంతోనే సరికొత్త వంగడంతో.. అరెకరంలో 3,223 కేజీల వరి పండించి రికార్డు సృష్టించింది ప్రసన్న. 150 మంది మోతుబరి వ్యవసాయదారుల్నీ తలదన్ని ఆదర్శ రైతుగా నిలిచింది. తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి రూ.5 లక్షల నగదు అందుకుంది!.

ప్రసన్న గురుంచి తన మాటల్లోనే నాకు పొలాలు అన్న వాటి నుండి వచ్చే స్వచ్చమైన గాలి, అలాగే పోద్దున్నే వచ్చే ఎర్రటి సూర్యోదయం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నేను మా నాన్నగారితో పొలంలో నడవడం నాకు చాలా ఇష్టం అలా రోజు పోలాల గట్లపై నడిచిన జ్ఞాపకం! ఎంతో మధురం ….మా నాన్న నాట్ల సమయంలో మడిలో మొదటిగా నాతోనే నాటు వేయించేవారు.

మాములుగా ఒక రైతు తన బిడ్డలను ఎట్టి పరిస్థితులలో రైతుగా ఉండటానికి ఒప్పుకోడు ఎందుకంటే వ్యవసాయం అంత లాభాసాటి కాదు కాబట్టి, కానీ మా నాన్న నన్ను చదువు ఎంత చక్కగా చదివించారో వ్యవసాయం అంత చక్కగా నేర్పించారు. నేను చిన్నప్పటి నుండి స్కూల్ కి ఎలా వెళ్ళానో పొలానికి అలాగే వెళ్ళాను. మా నాన్న ఏనాడు ‘చదువుకునేదానివి.. నీకెందుకీ బురద కష్టాలు!’ అన్లేదు. ఎందుకంటే తనకు వ్యవసాయం అంటే అంత ఇష్టం అలాగే వ్యవసాయం చేసే వారంటే ఇంకా ఇష్టం. నేను ఎమ్మెస్సీ బీఈడీ చదివాను అలాగే ఆ అర్హతలతో సైన్స్‌ టీచర్‌గా ఉద్యోగం సాధించాను. వ్యవసాయం పై ఇష్టంతో ఓ రైతునే పెళ్లి చేసుకున్నా. మదురై జిల్లాలోని తిరుపాళై్ల గ్రామం నా మెట్టిల్లు. అక్కడే ఐదెకరాల్లో సాగు చేస్తున్నాం. అటు పాఠాలు చెప్పడంలోనే కాదు.. పొలంలోనూ ప్రయోగాలు చేయడమంటే నాకు చాలా ఇష్టం.

మా రాష్టంలో గత కొంత కాలంగా వ్యవసాయంలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. నాకు ప్రయోగాలు అంటే చాలా ఇష్టం అందులోను నేను ఎక్కువగా ఇష్టపడే వ్యవసాయంలో అంటే ఇంకా ఇష్టం. దానితో మా రాష్ట్రంలో వ్యవసాయశాఖ ‘శ్రీవరి’ సాగును ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇందుకోసం పోటీలు పెడుతోంది. దీనికి మా తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం సృష్టించిన ‘ట్రై 3’ అనే సరికొత్త వంగడం వాడాలి. ఇది నాలో ఆసక్తి పెంచింది. నేను కూడా ఒక అర ఎకరంలో ఈ ప్రయోగం చేసి చూద్దాం అనిపించింది కానీ అది అనుకున్నంత సులభం కాదు అనే విషయం నాకు తెలుసు. దీని కోసం కొన్ని నెలలు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రత్యేక శిక్షణ తీసుకొవలసి ఉంటుంది అయిన నేను ఆ శిక్షణ తీసుకున్న. ఇక ఆచరించడమే మిగిలింది అనుకొని పూర్తిగా క్రమ పద్దతిలో మూడేళ్లు ఎన్నో ప్రయోగాలు చేశాను అయిన ఫలితం శూన్యం. ఈసారి సేంద్రియ దారి పట్టాను. కుళ్లిన ఆకులూ, పశువుల వ్యర్థాలనే ఎరువులుగా వాడాను. అధికారులు అందించిన రెండు కేజీల ట్రై-3 వంగడం విత్తనాలు నారుపోసి అర ఎకరంలో నాట్లు వేశాను. ఈ పంటకు సూర్యరశ్మి బాగా అవసరం. శ్రీ పద్ధతిలో సాగులో ప్రతి నాటు చుట్టుపక్కల 22.5 సెంటీమీటర్ల ఖాళీ ఉండేలా చూడాలి. అవన్నీ తు.చ.తప్పకుండా పాటించాను. నా ప్రయత్నం ఫలించింది. ఇక నా ప్రయోగం అంత సులభంగా ఏమీ జరుగాలేదు పొలంలో విత్తనాలు నారు పోసినప్పటి నుంచీ అధికారులు ప్రతిదీ దగ్గరుండీ పర్యవేక్షించి రికార్డుల్లో నమోదు చేసుకుని వెళ్లారు.ఈ మొత్తం పండించిన ధాన్యాన్ని అధికారులు వచ్చి దగ్గరుండి కొలిచి, వారి గోదాముల్లో భద్రపరిచారు. అర ఎకరానికి ఏకంగా 3223 కేజీల(43 బస్తాలు!) దిగుబడి వచ్చింది. దీన్నో కొత్త రికార్డుగా చూపారు. చాలా సంతోషం అనిపించింది.ఇక అలా అత్యధిక దిగుబడి సాధించిన మహిళా రైతుగా ప్రభుత్వం ఎంపిక చేసిందని, రూ.5లక్షల నగదు బహుమతి ఇస్తోందని స్వయంగా వ్యవసాయధికారులు వచ్చి చెప్పారు.అలాగే మా ముఖ్యమంత్రి జయలలిత కూడా నన్ను అభినందించారు. ‘మరిన్ని ప్రయోగాలు చేయండ’ని భుజం తట్టారు. ఇప్పుడు నా దృష్టి బిందు సేద్యంపైనే ఉంది. ఆ విధానంలో ఇప్పటిదాకా మా ఊరిలో ఎవరూ సాగు చేయలేదు. తొలిసారి నేనే ప్రయత్నించాలనుకుంటున్నాను..! అని ముగించింది.

(Visited 1,933 times, 78 visits today)