Home / Videos / శ్రీదేవి కి ఫస్ట్ టైమ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్…!

శ్రీదేవి కి ఫస్ట్ టైమ్ చేసిన దేవి శ్రీ ప్రసాద్…!

శ్రీదేవికి ఫస్ట్ టైమ్ చేయటం చాలా హ్యాపీ గా ఉందంటున్నాడు దేవి శ్రీ ప్రసాద్….ఇంతకీ ఏమిటా విషయం…ఎక్కడ జరిగింది? ఎలా జరిగింది? నెట్ లో హల్ చల్ చేస్తున్న ఈ వీడియో చూస్తే …అన్నీ విషయాలు బోధపడుతాయి. పులి సినిమా గురించి మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ చెప్పిన ఎన్నో విషయాలతో పాటే ..శ్రీదేవి విషయం కూడా ఆయన అప్పుడే చెప్పుకొచ్చారు. పులి కి, శివం సినిమా కి కూడా మ్యూజిక్ అందించిన దేవిశ్రీ ప్రసాద్ అంతరంగం ఏమిటో అతని మాటల్లోనే వినండి.

‘పులి ఫాంటసీ అడ్వంచరస్‌ సినిమా. ఈ తరహా సినిమాకు సంగీతాన్ని చేయడం ఛాలెంజింగ్‌గా అనిపించింది’’ అని దేవిశ్రీ ప్రసాద్‌ కిందటి బుధవారం ‘పులి’ తెలుగు వెర్షన్‌ ఆడియో విడుదల సందర్భంగా చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. విజయ్‌, శ్రుతిహాసన్‌, హన్సిక, శ్రీదేవి కీలక పాత్రల్లో నటించిన సినిమా ‘పులి’. సిబు థమీన్స్‌, పి.టి. సెల్వకుమార్‌ నిర్మాతలు. తెలుగులో సి.శోభ విడుదల చేస్తున్నారు. పులి ట్రైలర్‌ను, ఆడియో సీడీలను సి.కల్యాణ్‌, స్పెషల్‌ సాంగ్‌ను దిల్‌రాజు, ప్రమోషనల్‌ సాంగ్‌ను, బిగ్‌ సీడీని కొరటాల శివ విడుదల చేశారు. ‘పులిలో గ్రాఫిక్స్‌ షాట్స్‌ ఎక్కువగా ఉంటాయనీ, కమల్‌ కణ్ణన్‌ అద్భుతంగా సీజీ వర్క్‌ చేశారనీ, శ్రీదేవి సినిమాకు స్పెషల్‌ అట్రాక్షన్‌ అనీ, దేవిశ్రీ ప్రసాద్‌ పాటలు, రీరికార్డింగ్‌ అద్భుతంగా కుడిరాయనీ నిర్మాత చెప్పుకొచ్చారు.

దేవిశ్రీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘పులిలాంటి సినిమా తెలుగు, తమిళ్‌, హిందీలో ఒకేసారి విడుదల కావడం కరెక్ట్‌ అని నా అభిప్రాయం. సెల్వకుమార్‌, థమీన్స్‌ భారీ బడ్జెట్‌తో రూపొందించారు. చింబుదేవన్‌ కథ చెప్పినప్పుడు విని థ్రిల్లయ్యాను. శోభగారు ఈ సినిమాను ప్రమోట్‌ చేస్తున్న తీరు చూసి ఆనందించాను. విజువల్‌గా చాలా గ్రాండియర్‌ సినిమా అవుతుంది. అందరూ ఎంజాయ్‌ చేసేలా ఉంటుంది’’ అని చెప్పారు.

మాస్ ఆడియన్స్ ని ఉర్రూతలూగించే ఐటం సాంగ్సే కాదు… క్లాస్ ఆడియన్స్ ని కట్టిపడేసే మెలోడీ గీతాలకూ పెట్టింది పేరు మ్యూజిక్ తరంగ్ దేవిశ్రీ ప్రసాద్ మొత్తానికి పులి మీద బోలెడన్ని ఆశలు పెట్టుకున్నాడు..  అదిరిపోయే మ్యూజిక్ తో పాటు ఆటపాటలతో యువత  మనసు  దోచేసుకున్న  ఈ హై వోల్టేజ్ మ్యూజిక్ డైరెక్టర్…మరోవైపు పాటల రచయితగానూ పాపులర్ అవుతున్నాడు. ఆనందం సినిమాలో ఇలా ప్రేమకు అర్థాలు వెతికే పాటతో.. పాటల రచయితగా ప్రయాణం మొదలెట్టిన దేవిశ్రీ ప్రసాద్… వీలు చిక్కినప్పుడల్లా తన బాణీలకు తానే పాటలు రాస్తూ వస్తున్నాడు. ఆనందం తర్వాత కలుసుకోవాలని, వర్షం, ఒక ఊరిలో వంటి చిత్రాల్లోనూ ప్రేమపాటలు రాసిన దేవిశ్రీ.. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ తో ఊపున్న పాటతో కలం విదిలించాడు. శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన శంకర్ దాదా జిందాబాద్ లోనూ గుడ్ మార్నింగ్ అంటూ హుషారెత్తించిన దేవిశ్రీ సాహిత్యం  గబ్బర్ సింగ్ లో పిల్లా నువ్వు లేని జీవితం అంటూ గళమెత్తి… ఆపై నా మనసు నాలోనే లేదనే జులాయిగా మెప్పించాడు.ఇక ఇద్దరమ్మాయిల తోనూ శంకరాభరణ రాగం పాడించిన దేవిశ్రీ.. అత్తారింటికి దారేదిలోని చిట్టిగుండె పాటతో అదరహో అనిపించాడు.  బన్నీ కోసం సన్ ఆఫ్ సత్యమూర్తిలోనూ తన కలానికి పదును పెట్టిన దేవిశ్రీ ప్రసాద్ ‘పులి’తో మరింత పాపులారిటీ తెచ్చుకుంటాడనే ఆశాభావం వ్యక్తమవుతోంది. 

(Visited 115 times, 51 visits today)
[fbcomments url="http://peadig.com/wordpress-plugins/facebook-comments/" width="100%" count="off" num="3" countmsg="wonderful comments!"]