Home / Entertainment / దిమ్మ తిరిగే కలెక్షన్స్ సాధించిన శ్రీమంతుడు….!

దిమ్మ తిరిగే కలెక్షన్స్ సాధించిన శ్రీమంతుడు….!

Author:

సూపర్ స్టార్ మహేష్ శ్రీమంతుడు సైలెంట్ గానే దూసుకు వెళ్ళి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాహుబలి మానియాలో కూడా మహేష్ తన సత్తా ఏమిటో చూపించాడు. సూపర్ హిట్ అవటమే కాదు ఇప్పుడు ఇంకో రికార్డుని కూడా చేరుకుందీ సినిమా.. కొరటాల శివ దర్శకత్వం లో మహేష్, శృతి హసన్ ల జంట తో వచ్చిన ఈ సినిమా ఒక సామాజిక విప్లవాన్ని లేవదీసింది. శ్రీ మంతుడు స్పూర్తి తో గ్రామాలను దత్తత తీసుకోవటం అనే మంచి మార్పు వైపుకి అందరి దృష్టీ మళ్ళించినదీ సినిమా..

ప్రపంచ వ్యాప్తంగా 2500 సెంటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రపంచం మొత్తం మీదా విడుదలైన ప్రతి చోటా కాసుల వర్షం కురిపించింది. 144.45 కోట్ల కలెక్షన్ తో ఇప్పటి వరకూ తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్ళ చిత్రాలుగా ఉన్న “మగధీర” “అత్తారింటికి దారేదీ” లను కూడా మించి పోయింది. ఇప్పుడు మొదటి స్థానం లో బాహుబలి ఉండగా రెండవ స్థానం లో ఉన్నది శ్రీమంతుడే. బడ్జెట్ రీత్యా చూస్తే మాత్రం వందల కోట్ల బడ్జెట్ తో నిర్మించ బడ్డ బాహుబలి కంటే కూడా “శ్రీమంతుడు” సాధించిందే ఒక రకంగా పెద్ద రికార్డ్ అంటున్నరు సినీ విశ్లేషకులు..

Nizam: 38.85

Andhra: 47.65

Ceeded: 13.50

Karnataka: 13.25

Tamilnadu: 2.45

Rest of India: 6.3

Overseas: 19.95

Must Read: నరేంద్ర మోడీకి లేఖ రాసిన 8 ఏళ్ళ కుర్రాడు.

(Visited 254 times, 33 visits today)