Home / Political / ఒకే ఒక్క నంబర్ తో మీ ఫోన్ బ్యాలన్స్ తగ్గకుండా కాపాడుకోండి

ఒకే ఒక్క నంబర్ తో మీ ఫోన్ బ్యాలన్స్ తగ్గకుండా కాపాడుకోండి

Author:

stop-vas-service-155223

టెలికామ్ కంపెనీల నుంచి వినియోగదారులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య వ్యాస్ సర్వీస్. తమ ప్రమేయం లేకుండా వ్యాస్ సర్వీస్ పేరుతో బ్యాలెన్స్ కట్ చేస్తున్నారని వినియోగదారులు తరచూ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేస్తుంటారు. అయితే అన్ని సందర్భాల్లో కస్టమర్ కేర్ సెంటర్ల నుంచి సంతృప్తి కలిగించే సమాధానం రాకపోవచ్చు. దీంతో వినియోగదారులు అగ్గి మీద గుగ్గిలమై ఫోర్టబిలిటీ ఆప్షన్‌ను ఎంచుకుని అవస్థలు పడుతుంటారు. అయితే ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం దొరికింది.

                ఇకపై ఒకే ఒక్క ఎస్‌ఎమ్‌ఎస్‌తో అనసరమైన వ్యాస్ సేవలకు చెక్ పెట్టొచ్చు. ఏ టెలికామ్ సేవలు పొందుతున్న వినియోగదారులైనా 155223 నంబర్‌కు ‘STOP’ అని ఎస్‌ఎమ్‌ఎస్ చేస్తే చాలు. ఈ నంబర్ కు SMS పంపడం పూర్తిగా ఉచితం. ఎస్‌ఎమ్‌ఎస్ పంపిన వెంటనే రిప్లై వస్తుంది. ఆ మెసేజ్‌లో ఏ ఏ వ్యాస్ ప్యాక్‌లు యాక్టివేట్‌లో ఉన్నాయో తెలుస్తోంది. వాటిని డీయాక్టివేట్ చేసుకుంటే ఈ వ్యాస్ సర్వీస్‌ల నుంచి మీరు విముక్తి పొందొచ్చు. అనవసర బ్యాలెన్స్ కోతల నుంచి బయటపడొచ్చు.

(Visited 575 times, 23 visits today)