EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Devotional / కొత్త ఇల్లు, షాపు ముందు నిమ్మ, మిరపకాయలు ఎందుకు వేలాడదీస్తారంటే?

కొత్త ఇల్లు, షాపు ముందు నిమ్మ, మిరపకాయలు ఎందుకు వేలాడదీస్తారంటే?

Author:

మనం తరతరాలుగా పాటిస్తున్న ఆచారాలన్నింటికి ఒక సహేతుకమైన వివరణ ఉంటుంది. అందరూ తమ కొత్త ఇల్లు, షాపు ముందు లేదా కొత్త వాహనం కొన్నప్పుడు వాటి ముందు నిమ్మకాయలు, మిరపకాయలతో కూడిన దండను కడతారు. అలా కట్టడం వెనుక పెద్ద కధే ఉంది, అదేంటో చదవండి. మనకు అష్టైష్వర్యాలు ప్రసాదించే లక్ష్మీ దేవి గురించి అందరికీ తెలిసిందే అయితే ఆ లక్ష్మీదేవి కి స్వయానా ఒక అక్క ఉందనేది ఎంతమందికి తెలుసు. పైగా ఆమె పెళ్ళికోసం ఏకంగా శ్రీ మహా విష్ణువే నానా తంటాలు పడ్డాడట. ఇంతకీ ఈ అక్కయ్య ఎవరు? ఆమె పేరేంటి? ఎం చేస్తుంది ఎలా ఉంటుంది వగైరా విషయాలు తెలుసుకుందామా ?

lemons and mirchis

లక్ష్మీ దేవి అక్క పేరు అలక్ష్మీ దేవి, ఈవిడ ఎక్కడ ఉంటే అక్కడ దానం క్షీణిస్తుందట, లాభం మాట దేవుడెరుగు అలక్ష్మీ దేవి అడుగు పెడితే నష్టాల్లో కురుకోపోవాల్సిందే. క్షీరసాగర మథనం లో లక్ష్మీ దేవి ఆవిర్భవించాక మహా విష్ణువు ఆమెను పెళ్లి చేసుకుంటాను అంటాడు. అయితే తన అక్క పరిణయం కాకుండా తానూ వివాహం చేసుకోనని లక్ష్మీ దేవి సెలవివ్వడంతో అలక్ష్మీ దేవికి పెళ్లి చేసే బాధ్యత తన నెత్తినేసుకుంటాడు మహావిష్ణువు.

అయితే అలక్ష్మీ ఎక్కడున్నా నష్టమే కలుగుతుంది, ఐశ్వర్యం నిలవదని తెలిసి పెళ్ళికి ఎవరూ ముందుకు రారు. ముల్లోకాలు తిరిగినా ఆమెని చేసుకునేందుకు ఎవరూ అంగీకరించరు. అలాంటి సమయంలో ఉద్దాలకుడనే మహాముని ఆమెని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. వీరికి వివాహం అయ్యాకే లక్ష్మీ దేవి శ్రీ మహా విష్ణువుని పెళ్ళాడింది. అయితే ఉద్దాలకుడిని పెళ్ళాడిన అలక్ష్మీ ఆయన ఇంటిలోనకు వెళ్ళకుండా గుమ్మం ముందే ఆగిపోయిందట. ఇంత శుభ్రంగా ఉన్న ఇంటిలోకి తానూ రాలేనని, అశుభ్రం, మురికి దుమ్ము, ధూళి ఉంటేనే తానూ ఉండగలనని సెలవిస్తుందట. కాని తన చెల్లి అయిన లక్ష్మీ దేవి శ్రీ మహా విష్ణువుని పెళ్ళాడి వైకుంఠం లో ఉంటుందన్న ఈర్ష్యతో అన్ని లోకాలు తిరుగుతూ ఉంటుందట. కాకి వాహనంపై తిరిగే అలక్ష్మీ కి పుల్లగా ఉండే నిమ్మ, కారంగా ఉండే మిరప అంటే చాలా ఇష్టమట. ఎవరైన వాటిని సమర్పిస్తే వాటిని ఆరగించి వారికి ఎటువంటి నష్టం కలిగించదట. అందుకే కొత్త ఇంటి గుమ్మాలకు, షాపులకు, వాహానాలకు ముందు నిమ్మకాయ, మిరపకాయలతో ఒక దండ వేలాడదీస్తారు. వాటిని స్వీకరించి అలక్ష్మీ దేవి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అందుకే ప్రతి ఇంటి ముందు ఇలా వేలాడదీయడం ఆనవాయితీగా వస్తుంది. అలక్ష్మీ, లక్ష్మీ దేవికి సొంత అక్కే అయినప్పటికీ ఇలా ఇద్దరివి  పూర్తీ వ్యతిరేక స్వభావాలు ఉండడం వింతే.

Comments

comments