EDITION English తెలుగు
బాలకృష్ణపై నాగబాబు షాకింగ్ కామెంట్స్.! అసలు బాలకృష్ణ గురించి ఎందుకు టాపిక్ వచ్చింది?   ఈ స్వీట్ కేజీ 9000 రూపాయలు అంట.! అంత ధర ఎందుకో తెలుసా.? ఎలా తయారుచేస్తారంటే?   ముంబై ఎయిర్ పోర్ట్ లో సరికొత్త రికార్డ్.! అంబానీ కూతురు పెళ్లా మజాకా...!   పాతబస్తీలో ఓటింగ్ తగ్గడానికి కారణం అదేనంట.? ఆలస్యంగా వెలుగులోకి.!   సోదరి సుహాసిని తరుపున ఎన్ఠీఆర్ ఎందుకు ప్రచారం చేయలేదో తెలుసా.? కారణం ఇదేనట!   చాలామంది పండ్లపై ఉప్పు చల్లుకొని తింటారు..! అలా తినడం వల్ల ఏమవుతుందో తెలుసా.?   2014లో ఎంత శాతం మంది ఓట్లు వేసారో తెలుసా.? ఇప్పుడు మారిన లెక్కల వల్ల గెలుపు తారుమారవుతుందా.?   రాజమౌళి, ఎన్ఠీఆర్ ఓట్లు వేశారు.! మరి రామ్ చరణ్ ఎందుకు వేయలేదు.? అసలు కారణం ఇదే!   పాటలు పాడుతూ.. స్టెప్‌లు వేసిన కోహ్లీ.! మైదానంలో కోహ్లీ వెరైటీ డాన్స్ వైరల్ వీడియో.!!   గుత్తాజ్వాల ఓట్ల గల్లంతుపై మరో సంచలన ట్వీట్..! నెట్ లో చూస్కుంటే..?
Home / Inspiring Stories / మీకు 10 సంవత్సరాల లోపు అమ్మాయి ఉందా? అయితే మీకో శుభవార్త.

మీకు 10 సంవత్సరాల లోపు అమ్మాయి ఉందా? అయితే మీకో శుభవార్త.

Author:

ఆడపిల్లల పెళ్లి చేయడం కోసం అప్పుల పాలువుతున్న తల్లితండ్రులు మన దేశంలో చాలా మంది ఉన్నారు, ఇక ఇప్పటి నుండి ఆడపిల్లల పెళ్లి కోసం అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు, ఆడపిల్లల్ని కన్నా వాళ్ళకి ఒక ఆర్ధిక భరోసా నరేంద్ర మోడీ ప్రభుత్వం కల్పించింది, కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రూపొందించిన పథకం సుకన్య సంవృద్ది యోజన. ఈ పథకానికి అర్హులు అవ్వాలంటే మీ ఇంట్లో 10 సంవత్సరాలలోపు వయసు ఉన్న ఆడపిల్లలు ఉండాలి, ఈ స్కీమ్ లో మీరు నెలకు కొంత డబ్బు జమా చేసినట్లైతే మీ పాప చదువు లేదా పెళ్లి వరకు దానికి నాలుగు రెట్ల డబ్బును పొందవచ్చు, మీ అమ్మాయి పేరు మీద ఒక అకౌంట్ ని ఓపెన్ చేసి ఆ అకౌంట్ లో ప్రతి నెల డబ్బు వెయ్యాలి, ఇలా చేస్తే మీ అమ్మాయి భవిష్యత్ కోసం మీరు అప్పుల పాలు అవ్వాల్సిన అవసరం రాదు.

సుకన్య సంవృద్ది యోజన

 • అమ్మాయి జన్మించినప్పటి నుంచి పది సంవత్సరాలలోపు ఎప్పుడైనా పథకంలో చేరవచ్చు. స్థానిక తపాలా కార్యాలయంలో కానీ, అన్ని వాణిజ్య బ్యాంకులకు చెందిన ఏ శాఖలోనైనా కానీ ఖాతా ప్రారంభించి తల్లి లేదా తండ్రి సంరక్షకునిగా సంతకం చేయాల్సి ఉంది.
 •  ఒక్క బాలిక పేరిట ఒక్క ఖాతా మాత్రమే అనుమతిస్తారు. ఇద్దరు అమ్మాయిలుంటే ఇద్దరి పేరిట ఖాతా తెరవవచ్చు.
 • తల్లిదండ్రుల నివాస, గుర్తింపు ధ్రువపత్రాలు, బాలిక పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం దరఖాస్తుతో పాటు సమర్పించాలి.
 •  కనీస మొత్తం రూ.1000తో ఖాతా ప్రారంభించవచ్చు.
 •  ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.1,50,000 పొదుపు చేయవచ్చును.
 •  నెలకు ఒకసారి లేదా ఒక సంవత్సరంలో వీలున్నప్పుడు ఖాతాలో డబ్బులు జమ చేయవచ్చు. డీడీ లేదా చెక్కు ద్వారా మాత్రమే జమ చేయాలి. ఆన్‌లైన్ ద్వారా చెల్లించే సౌకర్యం లేదు.
 • ఖాతా ప్రారంభించిన తేదీ నుంచి 14 సంవత్సరముల వరకు ఇలా పొదుపు చేయాలి.
 •  అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం 50 శాతం నగదుగా తీసుకోవచ్చు,
 • 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మిగిలిన మొత్తం నగదు చెల్లిస్తారు.
 •  ఆదాయపు పన్ను సెక్షన్‌ 80 సీ ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
 • 18 సంవత్సరాల తర్వాత వివాహం చేయాలనుకుంటే మొత్తం సొమ్ము తీసుకోవచ్చు.
 • ఈ పథకం కింద జమ చేసిన నగదుకు ప్రభుత్వం ప్రకటించే వడ్డీ రేట్లు, ప్రతి ఏడాదికి మారుతూ ఉంటాయి.
 • మరింత సమాచారం కోసం మీ దగ్గర్లోని బ్యాంక్ ను కానీ పోస్టాఫీస్ ను గానీ సందర్శించండి.

Must Read: పాకిస్తాన్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన భారత సైంటిస్టులు.

Sukanya Samvrudhi Yojana 1

For More Details: www.sbi.co.in/sukanya-samriddhi-yojana

(Visited 84,063 times, 5,382 visits today)