Home / Entertainment / సింగర్ గా అదరగొట్టిన సుమ కనకాల.

సింగర్ గా అదరగొట్టిన సుమ కనకాల.

Author:

మన సినిమా తారలు కొంతమంది అప్పుడప్పుడు తమ గొంతు సవరించుకొని కొన్ని సినిమాలలో పాటలు పాడి వినిపించారు. అవి తమ సినిమా ప్రమోషన్స్ కి పనికి రావడంతో పాటు సింగర్ గా కూడా గుర్తింపు వస్తుండటంతో మన హీరోలు, హీరోయిన్ లు పాటలు పాడే చాన్స్ వస్తే వదులుకోవట్లేదు. ఇక తెలుగు వారి అభిమాన యాంకర్ సుమ కనకాల టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తన మాటలతో ఎటువంటి టీవీ ప్రోగ్రామ్ అయిన, సినిమా ఫంక్షన్ అయిన అవలీలగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక సుమ తనలోని కొత్త కోణాన్ని మనకు చూపించబోతుంది. మా టీవీ లో తను చేయబోయే కొత్త షో “సెల్ మీ ద ఆన్సర్” కి టైటిల్ సాంగ్ పాడింది. రఘు కుంచె దర్శకత్వంలో సుమ పాడిన పాటను మీరు చూసెయ్యండి.

(Visited 3,514 times, 16 visits today)