Home / Entertainment / కృష్ణ నది తీరంలో కృష్ణాష్టమి పాటలు.

కృష్ణ నది తీరంలో కృష్ణాష్టమి పాటలు.

Author:

Sunil Krishnashtami Movie Audio Release Date

వాసు వర్మ దర్శకత్వం లో, ఉత్తమ అభిరుచి గల నిర్మాత దిల్ రాజు నిర్మాణ సారధ్యం లో అద్భుతమైన డాన్స్ ల తో,తన హావభావాలతో మాస్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో సునీల్ ఇప్పుడు ‘కృష్ణాష్టమి’ అనే సరికొత్త ఫామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధ పడుతున్నాడు. నిక్కి గల్రాని మరియు డింపుల్ చోపడే హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి దినేష్ సంగీతాన్ని అందించారు.

చిత్ర నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… ” మా బ్యానర్ లో వస్తోన్న మరో చక్కని ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈ చిత్రం. అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది అన్న నమ్మకం ఉంది. రాజమండ్రి లో ఈ చిత్రం ఆడియో ను ఈ నెల 9 న రాజమండ్రి లో ని GIET కాలేజీ లో చాలా గ్రాండ్ గా చిత్ర బృందం ప్లాన్ చేశారు. చిత్రాన్ని ఫిబ్రవరి మొదటి వారం లో రిలీజ్ చేస్తాము”, అని దిల్ రాజు అన్నారు.

దర్శకులు వాసు వర్మ మాట్లాడుతూ..” ఇది ఒక చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఉన్నతమైన సాంకేతిక విలువలతో, కుటుంబం మొత్తం చూడదగ్గ చిత్రం మా కృష్ణాష్టమి. సునీల్ నుండి ప్రేక్షకులు కోరుకునే అంశాలతో పాటు, అటు క్లాస్ ని ఇటు మాస్ ని ఆకట్టుకునే ఫామిలీ వాల్యూస్ ఈ చిత్రం లో ఉంటాయి” అని తెలిపారు.

(Visited 188 times, 43 visits today)