Home / Inspiring Stories / “జల్లికట్టు జరుపుకోవచ్చు” అనుమతిచ్చిన సుప్రీం కోర్టు

“జల్లికట్టు జరుపుకోవచ్చు” అనుమతిచ్చిన సుప్రీం కోర్టు

Author:

Government gave permission to jallikattu

పొంగల్ పర్వదినం సందర్భంగా తమిళనాడులో సంప్రదాయ బద్ధంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. ఇండియన్ బుల్ ఫైట్ గా పిలిచే ఈ క్రీడ ని నిషేదించాలన్న డిమాండ్ వల్ల ప్రతీ ఏటా ఈ వ్యవహారం వివాదాస్పదం అవుతూనే ఉంది. తమిళనాడులో సంక్రాంతి సంబరాలలో భాగం గా ఎద్దులను మచ్చిక చేసుకుని, లొంగ దీసుకొనే ఒక ఆట పేరే జల్లి కట్టు గా వ్యవహరిస్తారు స్తానికులు. ఇది స్పెయిన్ లో జరిగే ఆటకు దగ్గరగా ఉన్నా దీని విధానం వేరుగా ఉంటుంది. స్పేయిన్ బుల్ ఫైట్ లో లాగా జల్లికట్టులో ఎద్దులను చంపరు. మచ్చిక చేసుకోవాలనుకొనేవారు అసలు ఏ ఆయుధాన్ని ఉపయోగించకూడదు. తమిళనాడులోని గ్రామాలలో సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ నాడు దీనిని నిర్వహిస్తారు. దీన్నే మంజు విరాట్టు అని కూడా వ్యవహరిస్తారు అంటే ఎద్దుల్ని మచ్చిక చేసుకోవడం అని అర్థం అన్నమాట.

ఈ ఆటలో ప్రతిభ చూపి వట్టి చేతులతో ఎద్దుని మచ్చిక చేసిన వారు “వీరులు” గా పిలుస్తారు. తమిళ పురాణాల లో కూడా ఈ జల్లి కట్టు ప్రస్తావణ ఉంది. ప్రకారం పూర్వకాలంలో మహిళలు జల్లికట్టులో విజేతలైన పురుషులని తమ భర్తలుగా ఎంచుకునే వారని తెలుస్తుంది. నీలగిరి జిల్లాకు చెందిన కరిక్కియూర్ అనే గ్రామంలో సుమారు 3500 సంవత్సరాల వయసుగల శిలా ఫలకాలపై మనుషులు ఎద్దులను తరిమే దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. అంతే కాదు ఇంకా మధురై కు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్ళుత్తు మెట్టుపట్టి అనే ప్రాంతంలో లభ్యమైన ఒక రాతి ఫలకం మీద కూడా ఒక మనిషి ఎద్దును నియంత్రిస్తున్నట్లుగా చిత్రించబడి ఉంది. ఆధారాలను బట్టీ ఈ క్రీడ వయసు కూడా సుమారు 1500 సంవత్సరాలు ఉండవచ్చునని శాస్త్రవేత్తల అంచనా.

jallikattu in action

అయితే కొన్ని సంవత్సరాలుగా జల్లి కట్టు పలు వివాదాలకు వేదికైంది జీవ కారుణ్యం ఒక కోణం కాగా.. ఈ క్రీడ స్థానిక రాజకీయ పార్టీల మధ్య స్పర్థలకూ, ప్రతీకారాలకూ వేదిక గా మారుతోంది. ఎద్దుల దాడిలో మరణించినట్టు గా చూపిస్తూ కొన్ని హత్యలూ జరిగాయన్న వార్తలూ ఉన్నాయి. దాంతో ఈ క్రీడని ఆపేయాలనే వాదన మొదలైంది. ఎద్దుల, ప్రజల కూ ప్రమాదం గా ఉండే ఇటువంటి క్రీడల ను నిర్వహించటం సరికాదనే వాదనలు కోర్టుదాకా వెళ్ళాయి. దాంతో ప్రతీ సంవత్సరం “జల్లికట్టు” నిర్వహణలో అనుమానం ఉంటూనే ఉంది.

ఈ సంవత్సరం కూడా జల్లికట్టు జరపాలా వద్దా అనే విశయం పై వివాదం రేగింది. పండగ సమీపిస్తున్నా, ఖచ్చితమైన సమాచారం లేకపోవడంతో జల్లికట్టు ప్రాభల్యం ఉన్న దక్షిణాదిజిల్లాల్లో వాతావరణం వేడెక్కింది. అయితే ఎట్టకేలకు జల్లికట్టు ఈ ఏడుకూడా గెలిచ్చింది. జల్లికట్లు నిర్వహణకు కేంద్రం అనుమతినిచ్చిందని స్వయంగా కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తనకు ఫోన్‌ చేసి తెలిపారని కేంద్ర మంత్రి పన్‌ రాధాకృష్ణన్‌ తెలిపారు. ఒక మైదానం లో బలమైన ఎద్దులను వదిలి వాటి ముందూ వెనుక పరుగులు తీస్తూ తమ ప్రాణాలతోనూ ఎద్దుల ప్రాణాలతోనూ చెలగాటమాడి ఆనందించటం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది…

(Visited 500 times, 62 visits today)