అత్తమామలని పట్టించుకోని భార్యకి విడాకులు ఇవ్వొచ్చు – సుప్రీం కోర్టు.

Author:

మన దేశంలో ఒకప్పుడు కుటుంబంలో అందరూ కలసి ఉమ్మడి కుటుంబంగా ఉండేవారు కానీ ఈ రోజులలో అలాంటి కుటుంబాలు చూడటానికైనా కనబడటంలేదు. చాలా మంది పెళ్లి కాగానే కొద్దీ రోజులు చాలా చక్కగా ఉంటారు. అలా కొన్ని నెలలు అవుతాయో లేదో కొత్తగ వచ్చిన భార్యకు ఇంట్లో వారికి చిన్న గొడవలు మొదలై చివరకు వేరుగా ఉండేవరకు చేరుతుంది. దానికి కారణం వృద్ధ అత్తమామలు అయినా వారిని నేను చూడవలసిన అవసరం నాకేంటి అనే విధానము అమ్మాయి మనసులో రావడమే, ఇక అబ్బాయి ఇటు తల్లిదండ్రులను వదులుకోలేడు అటు అమ్మాయిని వదులుకోలేడు… ఆ సమయంలో వృద్ధ తల్లిదండ్రులు మేము ఎలాగైనా బ్రతుకుతాం మీరు మాత్రం ఎక్కడ సంతోషం ఉంటుందో అక్కడ ఉండండి అని చెప్పుతారు…. పాపం అక్కడి నుండి వృద్ధ తల్లిదండ్రుల కష్టాలు మొదలవుతాయి.

suprem-court-decision-on-wife-and-paresnts-issue

వేరుగా ఉంటున్న కొడుకును వారి దగ్గరికి రాకుండా చేస్తుంది అతని భార్య. ఇది కథ కాదు చాలా ఇళ్లల్లో జరుగుతున్నా నిజం. ఇక నుండి మాత్రం అలా జరుగదు అంటుంది మన సుప్రీం కోర్టు.ఎందుకంటే కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తికీ పెళ్లయ్యాక వృద్ధ తల్లిదండ్రులను పోషించడం,ఆశ్రయం ఇవ్వడం కుమారుడి భాద్యత అని చెబుతుంది. అలాగే పెళ్లి తరువాత వచ్చినా మహిళా కూడా కుటుంబంలో భాగం కనుక … భర్తను తన తల్లిదండ్రల నుండి వేరు చేసే ప్రయత్నం చేయకూడదని అలా భర్తపై ఒత్తిడి తెచ్చే భార్యకు విడాకులు ఇవ్వొక్కని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దగ్గర డబ్బులు లేకపోయినా చూసుకోవలసిన బాధ్యత కుమారుడే అని జస్టిస్ అనిల్ ఆర్ .దవే, జస్టిస్ ఎల్. నాగేశ్వరావులతో కూడిన సుప్రీం కోర్టు బెంచ్ తీర్పునిచ్చింది.

(Visited 2,173 times, 73 visits today)