EDITION English తెలుగు
యాసిడ్ దాడి బాధితురాలికి అండగా నిలిచి ఘనంగా పెళ్ళి చేసారు.   ఒక్క కంద గడ్డ వంద మందులకు సమానమని ఎందుకంటారో తెలుసా?   కొంతమంది ఈ ఫోటోగ్రాఫర్ ఫోటోను దేవుళ్ళ పక్కన పెట్టి పూజిస్తారు ఎందుకో తెలుసా?   వాట్సాప్ లో షేర్ చేసిన తప్పుడు సమాచారం వలన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.   టూత్ బ్ర‌ష్‌, త‌ల దిండ్ల‌కు కూడా ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది.   తల్లికి గుడి కట్టించిన లారెన్స్‌.   Video: తన పెళ్లి వూరేగింపులోనే డ్యాన్స్ చేస్తూ చనిపోయిన పెళ్ళికొడుకు.   ఎయిర్ టెల్ బంపర్ ఆఫర్..! ఏడాది పాటు 4G డేటా, కాల్స్ ఫ్రీ..!   దేశానికి అన్నం పెట్టె రైతు చేతులకి సంకెళ్లు..!   పేద పిల్లల కోసం పాత చెప్పులు,షూలని రీసైక్లింగ్ చేసి కొత్త చెప్పులని తయారుచేస్తున్నారు.
Home / Latest Alajadi / రాజకీయ పార్టీలపై సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు…!

రాజకీయ పార్టీలపై సుప్రీం కోర్ట్ సంచలన తీర్పు…!

Author:

భారత దేశ అత్యున్నత న్యాయస్థానం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలకి చెంపపెట్టు లాంటి తీర్పుని వెలువడించింది, ఎన్నికలలో కులం, మతం, భాష పేరుతో ఓటుని అడగకూడదని, కులం, మతం, భాష పేరుతో ఓటర్లని ప్రభావితం చేయకూడదని తీర్పు ప్రకటించింది, కులం, మతం, భాషలు వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలని వాటి పేరుతో రాజకీయ నాయకులూ ఓటు అడగడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అని తెలిపింది.హిందూత్వ కేసులో దాఖలైన వివిధ పిటిషన్లను విచారించిన ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్‌.ఠాకుర్‌ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మానం ఈ మేరకు చారిత్రక తీర్పు చెప్పింది.

court-shocking-news-for-political-parties

కేసు నేపథ్యం
హిందూత్వ కేసులో తీర్పును 1995లో అప్పటి సీజే జస్టిస్‌ జెఎస్‌ వర్మ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెలువరించింది. హిందూ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఓట్లు అడినందునశివసేన నేత మనోహర్‌ జోషితో పాటు బీజేపీ, శివసేనకు చెందిన మరికొందరి ఎన్నిక చెల్లదని బొంబాయి హైకోర్టు 1991లో ఇచ్చిన తీర్పును జస్టిస్‌ జెఎస్‌ వర్మ నేతృత్వంలోని బెంచ్‌ కొట్టివేసింది. హిందూత్వ/హిందూయిజం అన్నది ఉపఖండంలో ప్రజల జీవన విధానమని.. అదొక మనఃస్థితి అని మతం కాదని ఆ తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూత్వ పేరుతో ఓట్లు కోరడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధం కాదని క్లారిటీ ఇచ్చింది.

Comments

comments