కేసీఆర్ మెప్పు కోసం మహిళ ప్రాణం తీసిన సూర్యాపేట పోలీసులు.

Author:

సూర్యాపేట పోలీసులు చూపించిన అత్యుత్సాహాన్ని ఒక మహిళ బలైంది, నిన్న పాలేరులో భక్త రామదాసు ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని ప్రారంభించడానికి వెళ్తు సూర్యాపేటలో ఉన్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటికి వెళ్లారు, ఆ సమయంలో శ్రీరామ్ నగర్ కాలనీ కి చెందిన లక్మమ్మకి గుండె నొప్పి రావడంతో కారులో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఇంటి పక్కన ఉన్న హాస్పిటల్ కి బయలుదేరారు, ఆ సమయంలో జగదీశ్వర్ రెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి కెసిఆర్ వస్తున్నాడని లక్మమ్మ ఉన్న వాహనాన్ని హాస్పిటల్ కి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు, లక్మమ్మ బంధువులు కాళ్లావేళ్లా పడ్డ పోలీసులు కనికరించలేదు, చికిత్స ఆలస్యం కావడంతో లక్మమ్మ వాహనంలోనే మృతి చెందింది.

లక్మమ్మ మృతికి పోలీసుల అత్యుత్సాహమే కారణం అని, సీఎం, పై అధికారుల మెప్పు కోసం ఒక మహిళ మృతికి కారణం అయ్యారని లక్మమ్మ భర్త ఆరోపించాడు, ఆనారోగ్యంతో ఉన్న వారిని ఆసుపత్రికి కూడా వెళ్లనివ్వకుండా అడ్డుకున్న పోలీసులని కఠినంగా శిక్షించి ఇటువంటివి మళ్ళీ జరగకుండా, ఎంత పెద్ద నాయకుడి పర్యటన ఉన్న కూడా అత్యవసరంగా హాస్పిటల్ కి వెళ్లే వారిని అడ్డగించకుండా సరైన చర్యలు తీసుకోవాలి. కేసీఆర్ కి ఈ సంఘటనతో సంబంధం లేనప్పటికీ అధికారుల మెప్పు కోసం ఇలా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

(Visited 354 times, 43 visits today)

Comments

comments