Home / Inspiring Stories / ఇకముందు వీరు తిన బోయేది మనిషి మాంసమేనా..!?

ఇకముందు వీరు తిన బోయేది మనిషి మాంసమేనా..!?

Author:

syrians eating grass

ఏనుగుల కుమ్ములాటలో చీమలు నలిగినట్టు ఇప్పుడక్కడ సామాన్యులు నలుగుతున్నారు. ఆకలితో అలమటించీ అలమటించీ చస్తున్నారు. అమ్మ పాలకూ నోచుకోని చిన్నారులు, ఆకలి తాళలేక గడ్డీ, ఆకులూ, కుక్కలూ, పిల్లులనీ చంపుకు తింటున్నారు… అవీ అయిపోతున్నాయి ఇక వారికి మిగిలింది ఒకే ఒక మార్గం నరమాంస భక్షణ. ఇంతటి దీన స్థితిలో ఉన్న వాడికి “నీకుటుంబానికి తిండి పెడతాం నువ్వు మానవ బాంబుగా మారు” అని ఏదైనా ఉగ్రవాద సంస్థ చెబితే అతనేం చేస్తాడొ మనందరికీ తెలిసిన సమాధానమే…

Syrians eating cat

అగ్ర రాజ్యాలకూ ఉగ్రవాదానికీ మద్య నలుగుతున్న సిరియా పౌరుల వెతలు అనీ ఇన్నీ కావు. ఆకలితో పిల్లులనూ కుక్కలనూ చంపుకు తిన్న వీరు ఇప్పుడు ఆకులూ గడ్డీ తింటున్నారు… సిరియా రాజధాని డెమాస్కస్‌కు సమీపంలో ఉండే ఈ ఊరిలో ఇప్పుడు దాదాపు 40వేల మంది ఆకలి చావులకు దగ్గరగా ఉన్నారు. ఇదే కాదు సిరియా లోని మరికొన్ని పట్టణాలలైన జబదాని, ప్రభుత్వ దళాల ఆధీనంలో ఉన్న ఫువా, కఫ్రాయావంటి పట్టణాల్లోనూ ఇదే దుస్థితి. చుట్టూ యుద్ధం జరుగుతుండటంతో ఆ ఊళ్ళలో నిత్యావసరాల జాడేలేదు. షాపుల్లో సరుకులన్నీ ఎపుడో నిండుకున్నాయి. కొన్నిసార్లు ఎన్నొ శ్రమలకోర్చి ఊరిలోకి స్మగ్లింగ్ చేసినా వాటి ధర సామాన్యులు అందుకునే స్థాయిలో లేదు కిలో బియ్యం 150 డాలర్లు, కిలో చక్కెర 200 డాలర్లు, పాలు కావాలంటే లీటరుకు 300 డాలర్లు ఇలా అందికాడికి దోచుకుంటున్నారు. పది కిలోల బియ్యం కొనటానికి మదయా సిటీలో ఒకరు తన కారు అమ్మేశాడు మరి పేదల సంగతి? ఇంతటి ధర పెట్టి తినేదెవరు? అయినా అంత ధర పెట్టి కొనేదెవరు? అందుకే మదయా వాసులు అందుబాటులో ఉన్న పిల్లులను చంపుకొని తిన్నారు అవి అయిపోవటం తో వాటి తర్వాత కుక్కల వంతు అవీ అయిపోయాయి. ఇక ఇప్పుడు గడ్డీ, ఆకులతో సూప్ కాచుకుని తాగుతున్నరు కొన్నాళ్ళకి అవీ అయిపోతాయి మరప్పుడు ఆకలికి తాళలేక సాటి మనుషులనీ తినే పరిస్థితి వస్తే..?

ఒక న్యూస్ చానెల్ ప్రతినిధి పోస్ట్ చేసిన వీడియోలో తన బిడ్డ పాలు తాగి నెలరోజులైందని ఓ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది, నేను వారం కిందట అన్నం తిన్నాను” అంటూ ఏడేళ్ళ పిల్లవాడు చెప్పాడు.తన పిల్లలు ఆకలితో మరణిస్తున్నారని ఒక తండ్రీ బోరున ఏడ్చాడు… నెల వ్యవధిలోనే దాదాపు 41మంది ఆకలితో చనిపోయారని సహాయ చర్యల్లో ఉన్న షామ్ అబ్దుల్లా అనే కార్యకర్త సీఎన్‌ఎన్ వార్తా సంస్థకు చెప్పారు. మదయాలో బక్క చిక్కిన ప్రజల ఫొటోలను, ఆకలి చావులకు గురైన వారి ఫొటోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో సర్కారులో కదలిక వచ్చింది. ఐరాస సహాయ బృందాలు ఆ ప్రాంతానికి చేరుకునేందుకు సిరియా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇప్పటికీ సరైన స్థాయిలో వారికి ఏవీ అందటం లేదు.

starving to death in Syria

రొట్టె రుచి ఎలా ఉంటుందో కూడా గుర్తులేదు, ఇది సిరియా పట్టణమైన మదయాలో మహ్మద్ అనే 27 ఏండ్ల వయసున్న ఒక ఎముకల గూడులా కనిపించే యువకుడి మాట. అయితే వారిదగ్గర ఇప్పుదున్నవి కేవలం తుపాకులే. ఎవరి మీద పేల్చాలో అర్థం కాని తుపాకులే.. ఉగ్రవాదుల నుంచీ రాబోయే సైన్యాల దాడుల నుంచీ తమను ఆదుకో గలిగేది అవిమాత్రమే మరి. పేగులు మెలిపెట్టే ఆకలి బాధ ఎంత భయానకంగా ఉంటుందో ఒక్క మాటలో వీళ్ళు చెప్పేసారు. ఇప్పుదు వారికిన్న ఒకే ఒక కోరిక “రొట్టె ఏ రుచిలో ఉంటుందో తెలుసుకోవటం” కుక్క మాంసపు రుచి వారి జీవితాల్లాగానే చాలా వెగటుగా అనిపించి ఉంటుంది. వీళ్ళిపుడు పీడితులు వీరికి ఉగ్రవాదుల అజెండా తెలీదు…అమెరికా ఉగ్రవాదులని కాకుండా తమని టార్గెట్ గా ఎందుకు చేసుకుందో తెలీదు.. ఉగ్రవాదం, సామ్రాజ్యవాదం, అవకాశవాదం అనే ఏనుగుల కుమ్ములాటలో నలుగుతున్న చీమలు….

(Visited 197 times, 30 visits today)