EDITION English తెలుగు
"పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!   బీటెక్ స్టూడెంట్స్ కు నెలకు రూ.80వేల స్కాలర్ షిప్.
Home / Inspiring Stories / కేసీఆర్ కలల జెండా పోయి.. స్తంభం మాత్రమే మిగిలింది.

కేసీఆర్ కలల జెండా పోయి.. స్తంభం మాత్రమే మిగిలింది.

Author:

తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయ్యి రెండు సంవత్సరాలు అయిన సందర్బంగా హైదరాబాద్ లో దేశంలోనే ఎత్తైన జాతీయ జెండాని ఎగరవేయాలని కేసీఆర్ భావించారు, అనుకున్నదే తడువుగా అధికారులు భారీ జెండాని ఎగరవేయడనికి సంజీవయ్య పార్క్ లో ఏర్పాట్లు చేశారు, జూన్ 2వ తేదిన ఎగరవేసిన జెండాని చూసి అందరు జాతీయభావంతో ఉప్పొంగిపోయారు, కేసీఆర్ చేసిన ఆలోచనని మెచ్చుకున్నారు కూడా, కాని తరువాత మొదలైంది అసలు సంగతి జెండాని అంత ఎత్తులో ఎగరవేయడం వల్ల తీవ్రంగా వీసే గాలులకి తట్టుకుంటుందని అధికారులు భావించారు కాని జెండా చిరిగిపోయింది.

Tallest-National-Flag-Hyderabad

హైదారాబాద్ లో వీస్తున్న భారీ గాలులకి జెండా చిరిగిపోయే అవకాశం ఉందని ముందుగానే అధికారులు అదనంగా 4 జెండాలని తెప్పించారు, కాని ఇప్పటి వరకు 3 జెండాలు గాలుల దెబ్బకి చిరిగిపోయాయి, ఇంకా ఒక్క జెండా మాత్రమే మిగిలింది, కాని నాలుగో జెండాను ఎగురవేసే సాహసాన్ని అధికారులు చేయటం లేదు. అదే చేస్తే.. రేపొద్దున ఏదైనా ముఖ్యమైన కార్యక్రమానికి జెండా దొరకటం అంత తేలికైన విషయం కాదు. ప్రత్యేకమైన ప్లాస్టిక్ తో రూపొందించిన జెండా బలమైన గాలులు వీచినా తట్టుకొని నిలబడుతుందన్న అంచనాలు వ్యక్తమైనా.. ప్రాక్టికల్ గా అది వర్క్ వుట్ కాని పరిస్థితి. దీంతో.. గాలుల వేగం తగ్గే వరకూ జెండా ఎగురవేయకూడదని అధికారులు నిర్ణయించారు. అదే సమయంలో.. తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఒక్క జెండానే మిగిలింది. మరికొన్ని జెండాలను తెప్పించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నా.. అవి వచ్చేసరికి మరికొంత కాలం పట్టనుంది. దీంతో.. ఉన్న ఒక్క జెండానే అట్లానే అట్టిపెట్టి.. ప్రస్తుతానికి జెండా స్తంభాన్ని అలా వదిలేశారు.

Tallest-National-Flag-Hyderabad

మరో కీలకమైన విషయం ఏమిటంటే.. ఈ భారీ జెండా ఖరీదు కూడా ఎక్కువగానే ఉంది. ఒక్కో జెండాకు రూ.1.15లక్షలు ఖర్చు అవుతున్న నేపథ్యంలో తరచూ జెండా చిరిగిపోతే దీని నిర్వహణ వ్యవహారం తడిచిమోపెడు అవుతుందన్న మాట వినిపిస్తోంది.నగర వాసుల్లో జాతీయ భావంని పెంపొందించాలనే ఆలోచనతో కేసీఆర్ గారు ఇంత పెద్ద జెండాని ఎగరవేయాలని అనుకున్నారు కాని అది శాస్త్రీయంగా వర్క్ అవుట్ అవుతుందా..లేదా అని ఆలోచించాల్సిన భాద్యత అధికారుల పైన ఉంటుంది, ముఖ్యంగా జాతీయతతో ముడిపడి ఉన్న అంశాలని చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసి అది అవుతుందా లేదా అని చూసికొని అప్పుడు చేస్తే ఇలా జాతీయ జెండా లేక.. వట్టి స్తంభం మాత్రమే మిగిలిపోయే దుస్థితి రాదు.

Must Read: తెలంగాణాలో రాబోయే కొత్త జిల్లాలు ఇవే.

Comments

comments