Home / Entertainment / సోషల్‌ మీడియాలో ప్రభుదేవా, తమన్నాల పెళ్లి ఫోటో

సోషల్‌ మీడియాలో ప్రభుదేవా, తమన్నాల పెళ్లి ఫోటో

Author:

tamanna prabhudeva marriage photo

మిల్కీ బ్యూటీ తమన్నా మొన్నటి వరకు ఊపిరి సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా, ఈ అమ్మడు పెళ్లెప్పుడు చేసుకుందా అని ఆశ్చర్యపోతున్నారా .. మరేంలేదు ఈ పెళ్లి రియల్‌లైఫ్‌లో కాదులేండి. రీల్‌ లైఫ్‌లో . తమన్నా ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి ఓ తమిళ సినిమా చేస్తుండగా, అందులోని ఓ సన్నివేశానికి అనుగుణంగా వీరివురు పెళ్లి పీటలెక్కారు. ప్రస్తుతం ప్రభుదేవా, తమన్నాల పెళ్లి ఫోటో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుండగా, ఈ ఫోటో నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తుంది.

           తమన్నా ప్రస్తుతం తమిళంలో విజయ్‌ సేతుపతి హీరోగా ‘ధర్మధురై’ అనే చిత్రంలో నటిస్తుంది. ఇందులో మేకప్‌ లేకుండా చీరతో సంప్రదాయబద్దంగా కనిపించే పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రంతో పాటు ప్రభుదేవా హీరోగా , ఎ.ఎల్‌. విజయ్‌ దర్శకత్వంలో ఓ హరర్‌ నేపధ్యం ఉన్న చిత్రంలో నటిస్తుంది. నెట్‌లో హల్‌ చేస్తున్న ఈ ఫోటో ఈచిత్రానికి సంబంధించినదే. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. చడీ చప్పుడు లేకుండా సైలెంట్‌గా మొదలైన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్‌ జరపుకుంటుంది.

(Visited 605 times, 19 visits today)