Home / Entertainment / 31స్ట్ నైట్ కి అప్పుడే బుక్ అయిన తమన్నా

31స్ట్ నైట్ కి అప్పుడే బుక్ అయిన తమన్నా

Author:

tamannah

కొత్త ఏడాది కి గ్రాండ్ గా వెల్ కామ్ చెప్పేందుకు 31 రాత్రి జరిగే ఈవెంట్ కార్పొరేట్ సంస్థలతో పాటు హోటల్స్ , మాల్స్, పబ్స్ ఇలా ప్రతి ఒకటి రెడీ అయిపోతుంటాయి..అలాగే ఈ 2016 కి కూడా గ్రాండ్ గా వెల్ కామ్ చెప్పేందుకు ఇప్పటినుండే సిద్దం అవుతున్నాయి…31 రాత్రి ఈవెంటుని ఓ రేంజులో సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్స్ చేస్తున్నారు..

ఆ రాత్రి ఎంజాయ్ చేసేందుకు వేదికలు రెడీ అవుతున్నాయి. పాపులర్ స్టార్ హీరోయిన్స్ నుండి చిన్న హీరోహిన్స్ వరకు ఆ రోజు హీరోయిన్స్ తో చిందులు వేయించేందుకు ఒప్పందాలు చేసుకోవడం మొదలు పెట్టారు..తాజాగా అందరికంటే ముందుగా మిల్కీ వైట్ బ్యూటీ తమన్నా 31 రాత్రి జరిగే ఈవెంట్ కోసం భారీ లేవలో డబ్బుతీసుకుందని సమాచారం. అమెరికాలోని ప్రఖ్యాత గ్రేడీ కోల్ సెంటర్ (చార్లొట్టే, ఎన్.సి ఏరియా) లో డాన్సు పెర్ఫామ్ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే నిర్వాహకులు భారీ ప్రైజ్ తో టిక్కెట్ల అమ్మకాలు కూడా ప్రారంభించారు.

ఒక వ్యక్తికి 89 అమెరికన్ డాలర్లు చెల్లించుకోవాలి. అదే ఒక కిడ్ తో పాటు కపుల్ వేడుకకు రావాలనుకుంటే 169 అమెరికన్ డాలర్లు చెల్లించుకోవాలి. తమన్నా క్రేజుతో ఈ టిక్కెట్లను భారీ రేట్లకు అమ్మేస్తున్నారు. మొత్తానికి మిల్కీ అందాలను చూడడానికి చాలామందే క్యూ కడుతున్నారు..ఇంకెంత మంది భామలు లైన్ లో ఉన్నారో చూడాలి.

(Visited 66 times, 31 visits today)