Home / Entertainment / రియల్ హీరో అనిపించుకున్న తనీష్..! ఆమె నుండి ఏం నేర్చుకున్నాడో తెలుసా.?

రియల్ హీరో అనిపించుకున్న తనీష్..! ఆమె నుండి ఏం నేర్చుకున్నాడో తెలుసా.?

Author:

తెలుగు బిగ్ బాస్ 2 సీజన్లో టైటిల్ గెలవక పోయినా హీరో తనీష్ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. బిగ్ బాస్ లో తనీష్ ఫైనలిస్ట్ గా నిలిచాడు. కానీ కౌశల్ తో వివాదాల వల్ల విమర్శలకు గురయ్యాడు. అప్పుడు అంతగా ట్రోల్ చేసిన తనీష్ ని ఇప్పుడు చాలా మంది మెచ్చుకుంటున్నారు. ఎందుకో తెలుసా.? తనీష్ చేసిన పని ఏంటి అనుకుంటున్నారా.? వివరాలు మీరే చూడండి!

చూపు లేని నాగమణి అనే యువతి కోసం పరీక్ష రాసి సహాయం చేశాడు. అదే విధంగా జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏ విధమైన అనుభవాలను నేర్పుతాయి అనే విషయాల్ని క్లుప్తంగా వివరించాడు. అంతే కాకుండా నేడు చేసిన ఒక పని చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఈ కుర్ర హీరో పేర్కొన్నాడు. మంచి పని చేసి అది తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

నాగమణి అనే యువతి కోసం పరీక్ష రాశా. మనలో ఉన్న ఒక మైనస్ వలన జీవితంలో ఎదగకుండా ఆగిపోకూడదు అని నాగమణికి చేసిన సాయం వలన తెలుసుకున్నా అని తనీష్ తెలిపాడు. ఈ సాయం వలన నాకు తెలియని ఆనందం, సంతృప్తి కలిగిందని తనీష్ తెలిపాడు. తనీష్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

హీరో తనీష్ కెరీర్ లో ఇంకా సరైన హిట్ పడలేదు. రీసెంట్ గా రంగు ఆ నే సినిమాతో వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి పేరైతే తెచ్చుకోగలిగాడు కానీ హీరోగా మాత్రం కెరీర్ సక్సెస్ కాలేదు.

(Visited 1 times, 123 visits today)