Home / Inspiring Stories / బెంగుళూరులో టాంజానియా యువతి పై దారుణం – వెల్లువెత్తుతున్న నిరసనలు.

బెంగుళూరులో టాంజానియా యువతి పై దారుణం – వెల్లువెత్తుతున్న నిరసనలు.

Author:

Tanzanian Girl Bangalore

ఇప్పటి వరకూ భారత దేశంలో కుల,మత వ్యతిరేకతతో జరిగిన దాడుల గురించే విన్నాం. కానీ ఇప్పుడు జాతి విద్వేషం కూడా మొదలైంది. బెంగుళూరులో ఆమె రావటానికి గంటకు ముందు ఓ సూడానీస్ డ్రైవర్ చేసిన తప్పుకు స్థానికులు ఏ పాపం తెలియని మరో టాంజానియా విద్యార్థిని దారుణంగా అవమానించి, శిక్షించడం మన దేశానికే అవమానం. తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళితే. “ముందు నువ్వు వెళ్ళి రోడ్డు ప్రమాదానికి కారణమైన సూడానీ డ్రైవర్‌ను తీసుకొని రాపో! అంటూ పోలీసుల ఈసడించుకోవడం” ఆమె శరీరం మీద వెకిలి కామెంట్లు చేయటం ,స్థానిక కాంగ్రెస్ నాయకుడు బీఎస్ శంకర్ సామూహిక దాడిని బహిరంగంగా సమర్థించడం దిగజారుతోన్న విలువలకు సాక్ష్యం.

ఐటీ రంగంలో అమెరికాతో పోటీ పడుతున్న బెంగళూరు నగరాన్ని ఇండియా సిలికాన్ వ్యాలీ అని పిలుస్తుంటారు. ఇక్కడికి మన హైదరాబాద్ లో కన్నా ఎక్కువ మంది ఆఫ్రికా దేశస్తులు చదువుకోవటానికి వస్తారు. అయితే శనివారం రోజు రాత్రి ఒక సూడాన్ దేశస్తుడు హెసరఘాట్ రోడ్డులో ఒక 35 ఏళ్ళ మహిళను ఢీకొట్టాడు. ఆమె అక్కడికక్కడే మరణించగా, అతను మాత్రం అక్కడి నుండి పారిపోయాడు. అయితే అక్కడ గుంపు ఎక్కువగా ఉండటంతో ఒక గంట తర్వాత అటువైపె వెళ్తున్న మరో టాంజానియా యువతి తన కారు ఆపి అక్కడే ఉన్న వ్యక్తిని ఏం జరిగింది? అని అడిగింది. వెంటనే ఆగ్రహంతో ఆమె పై పడ్డ అక్కడి జనం ఆమెను విచక్షణా రహితంగా కొట్టటమే కాకుండా ఆమె వేసుకున్న టీ షర్టుని లాగి చించి వేశారు. అక్కడే ఉన్న పోలీసులు కూడా వారిని అడ్డుకోలేదు. అటుగా వెళుతున్న ఒక వ్యక్తి ఆమె స్థితిని చూసి తన షర్ట్ ఇవ్వబోయాడు. ఐతే అతన్ని కూడా కొట్టిన జనం ఆమెను షర్ట్ వేసుకోనివ్వకుండా అలానే పరుగెత్తించారు. ఇంకా ధారుణం ఏమిటంటే ఆమె వారి నుంచి తప్పించుకోవటానికి అటుగా వెళుతున్న బస్ లో కి ఎక్కింది. దాంతో ఆ బస్సులో ఉన్నవారు కూడా వెకిలిగా ఈలలు వేస్తూ ఆమెను మళ్ళీ రోడ్డుపైకి నెట్టివేసారు.ఆమెను అంతగా కొట్టటమే కాకుండా ఆమె కారుని కూడా తగలబెట్టారు అత్యంత సంస్కారవంతులైన మన దేశ ప్రజలు. గత రెండు, మూడేళ్లుగానే జాతి విద్వేష సంఘటనలూ అప్పుడప్పుడైనా భారత్‌లో కనిపిస్తున్నాయి. 2013లో గోవా అంతట నైజీరియన్లకు వ్యతిరేకంగా దాడులు జరిగాయి.


అయితే తమ దేశస్తుల మీద జరిగే దాడులని ఇన్నాళ్ళు భరించిన ఆఫ్రికన్ దేశాలు ఈ సారి మాత్రం తీవ్రంగానే స్పందించాయి. “మా పౌరులే కాదు మీ దేశస్తులూ మా దేశాల్లో పని చేస్తున్నారన్న విషయం మరిచి పోవద్దు నైజీరియాలో పనిచేస్తున్న భారతీయులకు వ్యతిరేకంగా కూడా మేము ఇలాంటి దాడులు చేయగలం అని గుర్తుపెట్టుకోండి” నైజీరియా దౌత్యవేత్తలు భారత్‌ను బెదిరించారంటే వాటి తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు. ఐతే దేశం మొత్తం కూడా ఈ ఘటన మీద విమర్శలు పెరిగిపోతూండటంతో కర్ణాటక ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది. ఈ ఘటనలో పాల్గొన్న వారిలో ఇప్పటికి అయిదుగురిని అరెస్ట్ చేసారు.అరెస్టైన వారిలో లోకేష్ భంగరి, వెంకటేష్ రామయ్య, సలీమ్ పాషా, భాను ప్రకాశ్, రెహ్మతుల్లా అనే వ్యక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.

(Visited 735 times, 7 visits today)