Home / Latest Alajadi / తెలంగాణ పాఠశాలల్లో 23,494 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.

తెలంగాణ పాఠశాలల్లో 23,494 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.

Author:

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిరుద్యోగులకు మరో తీపి కబురు ప్రకటించించారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న మొత్తం 23,494 ఉద్యోగాలను విడుతల వారీగా భర్తీచేయాలని ఆదేశాలు జారి చేసారు. ముందుగా వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన 8,245 ఉద్యోగాలను యుద్దప్రాతిపధికన భర్తీ చేయాలని అధికారులకు సూచించారు. ఈ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ ద్వారా నోటిఫికేషన్‌ జారీచేసి అభ్యర్దుల నియామకాలు చేపట్టాలని సూచించారు కేసీఆర్‌. మొత్తం 23,494 ఉద్యోగాలలో 20,299 పోస్టులు బోధనా సిబ్బంది కి సంబందించిన మరియు మిగిలిన 3,195 పోస్టులు బోధనేతర సిబ్బందికి సంబందించినవి ఉన్నాయి.

teacher jobs

కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తరువాత చాల కొత్త గురుకులాలను మంజూరు చేసారు, ఇప్పుడు ఆ కొత్త గురుకులాల్లో అత్యుత్తమ బోధన జరగడం కోసం అందుకవసరమైన అధ్యాపకులు, సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియిమించనున్నారు.ప్రభుత్వం కొత్తగా మొత్తం 726 గురుకులాలను నిర్వహింస్తుందని సీఎం ఈ సంధర్భంగా తెలిపారు. కొత్తగా మంజూరైన గురుకుల పాఠశాలల భవన నిర్మాణాలకు అనువైన స్థలాలను తొందరగా గుర్తించాలని అధికారలను అదేశించారు కేసీఆర్‌. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని మా అలజడి తరపున ఆల్ ద బెస్ట్ .

(Visited 390 times, 7 visits today)