EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

తుది శ్వాస అతని కోసమే..! పెళ్లయిన వెంటనే చనిపోయింది.

Author:

మనసుకి నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకొని జీవితాంతం సుఖంగా జీవించాలని ప్రతి ప్రేమికులు ఆశపడుతారు, అమెరికాలోని కనెక్టికట్ కు చెందిన హెథర్, డేవిడ్ లు కూడా అనుకోకుండా పరిచయం అయి ఒకరి మనసు ఒకరు తెలుసుకొని గత రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు, ఇక ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం అనుకునేలోపు విధి వారిని వక్రీకరించింది, సంవత్సరం క్రితం హెథర్ కి బ్రెస్ట్ కాన్సర్ ఉన్నట్లు తెలిసింది. అప్పటికే కాన్సర్ ఫైనల్ స్టేజిలో ఉండటంతో ట్రీట్ మెంట్ కోసం హెథర్ హాస్పిటల్ లో చేరింది. రోజు రోజుకు ఆమె పరిస్ధితి విషమించడంతో డిసెంబర్ చివరి వారంలో పెళ్లి చేసుకోవాలని హెథర్, డేవిడ్ లు నిర్ణయించుకున్నారు.

love-story

సాధారణ పెళ్లిలానే కుటుంబ సభ్యులందరి సమక్షంలో హాస్పిటల్ లోనే హెథర్‌, డేవిడ్‌లు పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి వచ్చేవారు ఎలాంటి గిఫ్ట్ లు తీసుకురావద్దని ఆ డబ్బును ఛారిటీలకు ఇవ్వాల్సిందిగా హెథర్‌ కోరింది. బెడ్‌పై ఉన్న హెథర్‌ తన భర్త డేవిడ్‌తో ప్రేమగా మాట్లాడిన మాటలే ఆఖరి మాటలయ్యాయి. తను మనసారా ప్రేమించిన డేవిడ్‌ ని పెళ్లి చేసుకున్న కొద్దిసేపటికే హెథర్‌ కన్నుమూసింది. చావుబతుకుల మధ్యనున్న ప్రేయసి కోసం డేవిడ్ పడ్డ తపన, బాధ అందరిని కలచివేసింది పెళ్లి టైంలో హెథర్‌, డేవిడ్‌ దంపతులు దిగిన ఫొటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

love-story1

(Visited 1,500 times, 1,522 visits today)

Comments

comments