Video:ఫైట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ లతో సుకుమార్ తీన్మార్ డాన్స్ అదుర్స్..!

Author:

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత హీరో హీరోయిన్లుగా ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సుకుమార్ దర్శకత్వంలో 1985 వ సంవత్సరం బ్యాక్ గ్రౌండ్ లో రంగస్థలం అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే, కొన్ని రోజుల కిందట రిలీజ్ చేసిన రంగస్థలం టీజర్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది, ఆ టీజర్ తో సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి, సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది, ఇప్పటికే గోదావరి జిల్లాలో చాలా రోజులు షూటింగ్ చేసిన సంగతి తెలిసిందే… షూటింగ్ స్పాట్ లో డైరెక్టర్ సుకుమార్, ఫైట్ మాస్టర్స్ రామ్- లక్ష్మణ్ లతో కలిసి తీన్మార్ మాస్ బీట్ కి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ఫైట్ మాస్టర్లు రామ్ – లక్ష్మణ్ ఫైట్ కంపోజ్ చేస్తున్న సమయంలో షూటింగ్ గ్యాప్ లో డైరెక్టర్ సుకుమార్ తో తీన్మార్ మ్యూజిక్ కి డాన్స్ వేయించారని.. ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు, ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

(Visited 193 times, 204 visits today)

Comments

comments