Home / Inspiring Stories / తెలంగాణాలో పదో తరగతి ఫలితాలు విడుదల.

తెలంగాణాలో పదో తరగతి ఫలితాలు విడుదల.

Author:

Telangana-10th-class-results-2016

తెలంగాణా విద్యార్థుల పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి, తెలంగాణా ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విదుదల చేసారు, తెలంగాణాలో పదో తరగతి పరీక్షలకి 5.60 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు, పరీక్షలు జరిగిన నెల రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసారు.మొత్తం 85.63 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బాలురు 84.70 శాతం, బాలికలు 86.57శాతం ఉత్తీర్ణత సాధించారు.

ఇక ఫలితాల్లో వరంగల్ (95.13) ప్రథమ స్థానంలో నిలవగా, హైదరాబాద్ (76.23)చివరి స్థానానికి పడిపోయింది. గత  ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఎనిమిది శాతం ఉత్తీర్ణత పెరిగింది. జూన్ 15నుంచి 29వరకూ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ నెల 26వ తేదీలోగా ఫీజు చెల్లించాలి. 2379 పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి.

 

Results Links:

(Visited 446 times, 13 visits today)