EDITION English తెలుగు
కన్నకొడుకు కనులముందే చనిపోతుంటే, ఆ తల్లి ఏంచేసిందో తెలుసా?      "పీవీ సింధు..మమ్మల్ని క్షమించు"   Video: ప్రియురాలి శవానికి తాళి కట్టి పెళ్లి చేసుకున్న ప్రేమికుడు.   Video: ఒక్క పాటతో ఇంటర్నెట్ ని ఊపేస్తున్న మల్లు బ్యూటీ..!   నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా చేసాడు.. సంపాదించిన ఆస్తి రూ.3930 మాత్రమే..!   మహేష్ బాబు, అల్లు అర్జున్ లకు షాక్ ఇచ్చిన రజినీకాంత్..!   లవర్స్ మధ్య జరిగిన ఈ వాట్సాప్ చాట్ లు చూస్తే ఖచ్చితంగా నవ్వుకుంటారు..! 3వది అయితే హైలైట్..!   మహారాజశ్రీ హైకోర్టు న్యాయమూర్తి గారికి....! కదిలించిన జెడ్పి విద్యార్థినిల లెటర్..!   హైదరాబాద్ లోని ఈ హాస్పిటల్ లో రూ. 10 లక్షలు అయ్యే చికిత్సలు అన్ని ఉచితం..!   తల్లి చనిపోతూ తన కొడుక్కి రాసిన లెటర్..! అది చదివితే కన్నీళ్లొస్తాయి...!
Home / Political / అంతా తూచ్…! నయీమ్ తో రాజకీయ నేతలకి,పోలీసులకి ఎటువంటి సంబంధాల్లేవ్..!

అంతా తూచ్…! నయీమ్ తో రాజకీయ నేతలకి,పోలీసులకి ఎటువంటి సంబంధాల్లేవ్..!

Author:

నయీమ్ ని పెంచి పోషించింది అప్పటి పాలకులే అని నయీమ్ తో సంబంధం పెట్టుకున్న రాజకీయ నాయకులని, పోలీస్ అధికారులని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా బద్దలు కొట్టినట్లు స్వయంగా సీఎం కెసిఆర్ యే ప్రకటించారు, నయీమ్ కొన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేసి రాజకీయా నాయకులకి, పోలీసులకి బహుమతిగా ఇచ్చేసాడు, నయీమ్ ప్రతి రాజకీయ నాయకుడితో, పోలీస్ అధికారితో జరిపిన లావాదేవిలని తన డైరీలో రాసుకున్నాడు అని పోలీసులే తెలిపారు, ఇప్పుడు మాత్రం గ్యాంగ్ స్టర్ నయీమ్ తో రాజకీయ నాయకులకి, పోలీసులకి ఎటువంటి సంబంధాలు లేవని తేల్చేసారు.

nayeem-story

నయీమ్ కేసుని సిబిఐతో విచారించాలని హై కోర్ట్ లో వేసిన పిటిషన్ కి కౌంటర్ గా తెలంగాణ ప్రభుత్వం చెప్పిన సమాధానం ఇది. నయీమ్ కి రాజకీయా నాయకులతో, పోలీస్ అధికారులతో సంబంధాలు ఉన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని, నయీమ్ రాజకీయా నాయకులకి, పోలీసులకి ఎటువంటి లబ్ది చేకూరించలేదని తెలంగాణ ప్రభుత్వం హై కోర్ట్ తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వం హై కోర్ట్ కి తెలిపిన వాటిలో ముఖ్యాంశాలు:

  • నయీమ్ తో రాజకీయా నాయకులకి, పోలీస్ అధికారులకి ఎటువంటి సంబంధాలు లేవు.
  • నయీమ్ ద్వారా రాజకీయా నాయకులూ, పోలీసులు ఎటువంటి లబ్ది పొందలేదు.
  • నయీమ్ కి మావోయిస్టులతో, దావుద్ ఇబ్రహీంతో సంబంధాలు లేవు.
  • సోహ్రాబుద్దీన్ హత్య కేసులో సిబిఐ నయీమ్ ని వెతుకుతుంది అనేది అబద్దం.
  • మాజీ డీజీపీ, మాజీ మంత్రిపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం.
  • నయీమ్ కేసులో ఇప్పటి వరకు 167 కేసులు పెట్టి 116 మందిని ఆరెస్ట్ చేసాం.848 సాక్ష్యాలు నమోదు చేసాం.
  • ఈ కేసుని సిబిఐకి అప్పగించాల్సిన అవసరం లేదు, విచారణ సవ్యంగానే జరుగుతుంది.
  • ఈ పిల్ ని భారీ జరిమానాతో కొట్టి వేయండి.

ఇది నయీమ్ కేసులో విచారణ సరిగ్గా జరగట్లేదని, ప్రధాన నిందితులు అయిన రాజకీయా నాయకులని, పోలీస్ అధికారులని ఈ కేసు నుండి తప్పించే విధంగా ప్రయత్నిస్తున్నారని, నయీమ్ కేసుని సిబిఐ చేత విచారణ చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హై కోర్ట్ లో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది.

నయీమ్ చేసిన దురాగతాల గురుంచి ప్రతి ఒక్కరికి తెలుసు, నయీమ్ అనే గ్యాంగ్ స్టర్ ని పెంచి పోషించింది రాజకీయా నాయకులూ, పోలీసులే అని జగమెరిగిన సత్యం, కానీ ఇందుకు భిన్నంగా తెలంగాణ ప్రభుత్వం నివేదిక ఇవ్వడంతో తెలంగాణ ప్రజలు ఆశ్ఛర్యపోతున్నారు, నయీమ్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని శిక్షిస్తాం అని పదే పదే సీఎం కెసిఆర్ యే చెప్పడంతో న్యాయం జరుగుతుంది అని భావించిన నయీమ్ భాదితులు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వమే నిందితులని కాపాడే ప్రయత్నం చేస్తుండటంతో ఏం చేయాలో దిక్కు తోచక బాధపడుతున్నారు.

Comments

comments