EDITION English తెలుగు
హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.   జెడి (ఎస్) నాయకుడు హెచ్డి కుమారస్వామి కర్నాటకలో 24 వ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు.   ఈ ఫొటో చూడగానే "బాషా" సినిమా గుర్తు వస్తే తప్పు లేదు. నిజంగానే ఆటో వెనకాల రాసిన దాన్ని ఆచరించి చూపిస్తున్నాడు హైదరాబాద్ కు చెందిన ఈ ఆటో డ్రైవర్.   స్మార్ట్ టీవీ ఇక మన బడ్జెట్ లోనే-MI వారి కొత్త ఉత్పత్తులు   పండంటి కాపురానికి పది సూత్రాలు..   ఇలా పండ్లు ఎప్పటికీ పిల్లలకు పెట్ట కూడదు

ఏపీ టూ టీఎస్ గా వాహనాల కోడ్ మార్చాలంటూ ఆదేశాలు….!

Author:

ఉమ్మడి రాష్ట్రాన్ని సూచిస్తూ నమోదైన మోటారు వాహనాల రిజిస్ట్రేషన్ వివాదం మళ్ళీ తెర మీదికి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రం ఉన్న కాలంలో వాహన నంబరు ప్లేట్ల మీద ఉండే ఏపీ అనే అక్షరాలతో పాటు గా జిల్లా కోడ్ ను కూడా మార్చుకోవాల్సిందేనంటూ తెలంగాణా ప్రభుత్వం హుకుం జారీ  చేసింది. రాష్ట్ర, జిల్లా కోడ్ లు తప్ప మధ్యలో ఉండే వాహన రిజిస్ట్రేషన్ నంబరు మాత్రం యథాతథం గానే ఉండనుంది. ఈ మేరకు అక్టోబర్ 15 న ప్రభుత్వ కార్యాలయం నుండి ఒక ప్రకటన వెలువడింది. ఈ మార్పులు చేసుకునేందుకు గానూ నాలుగు నెలల గడువు ఇస్తున్నట్టు ఆఓగానే తమ తమ వాహనాల కోడ్ లను ఇప్పుడు సవరించిన ప్రకారం మార్చుకోవాలనీ సూచించింది.

ఐతే తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లోనే రిజిష్ట్రేషన్ కోడ్ ని మార్చుకోవాలంటూ ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి రాష్ట్రాన్ని(ఆంధ్ర ప్రదేశ్ )ను సూచించే APఅనే అక్షరాలకు బదులుగా సొంత రాష్ట్రం అయిన తెలంగాణాను సూచించే TS అనే అక్షరాలను వాడాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అప్పటినుంచీ కొత్తగా రిజిస్టరయ్యే వాహనాలన్నీ..కోడ్ తోనే ఉంటున్నాయి. అయితే పాత వాహనాల నంబర్లను కూడా మార్చాలంటూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టులో పిటీషన్ వేశారు.ఈ విషయంలో చర్యలు తీసుకోవాలన్న కోర్టు ఆదేశాల ప్రకారం ప్రజల అబ్యంతరాలను గౌరవించి,చర్చలు జరిపాకే తుది నిర్ణయాన్ని తీసుకుంటాం అని హైకోర్టుకు విన్నవించింది ప్రభుత్వం. ఐతే ఒకే రాష్ట్రం లో రెండు రకాల కోడ్ లతో అయోమయ పరిస్థితి నెలకొంటోందంటూ పాత వాహనాల కోడ్ లను మార్చాల్సిందే అని తాజాగా తన నిర్ణయన్ని తెలిపింది ప్రభుత్వం.

రాబోయే నాలుగు నెలల కాలాన్ని గడువుగా ఇచ్చి ఆలోగనే తమ వాహన కోడ్ లను మార్చుకోవాలంటూ వాహనదారులకు సూచించింది.కానీ ఇక్కడ నెలకొన్న కొత్త సమస్య ఏమిటంటే కొత్త రిజిస్ట్రేషన్ కోడ్ లను మార్చినప్పుడు RC కార్డు కూడా మార్చాల్సి రావటం దానికయ్యే ఖర్చుని వాహనదారుడే భరించాల్సి రావటం.ఇప్పుడు ద్విచక్ర వాహనానికి రూ.100 ఆపైబడిన వాటికి రూ.200 చెల్లించాల్సిందే అంటూ రాష్ట్ర రవాణా శాఖ పేర్కొంది. అంతే కాదు ముందుగా కోడ్ మార్చాలనుకునే వాహన దారుడు ఆన్ లైన్లో బుక్ చేసుకొని వారు ఇచ్చిన తేదీన వెళ్ళి రుసుము చెల్లించి కొత్త RC కార్డు తీసుకోవాలి. ఒక వేళ ఆరోజున వెళ్ల లేకపోతే మళ్ళీ దరఖస్తు చేసుకోవలసిందే.. హైదరాబాద్ లో ఇంచుమించు గా 20 లక్షలకు పైగానే పాత వాహనాలున్నాయి. ఐతే వాటి జిల్లా కోడ్ ని మార్చే అవసరం లేకుండా పాతవే ఉండేలా సవరించారు. అంతే కాదు ఆదిలాబాద్ కు ఉమ్మడి రాష్ట్రం లోనూ ఇప్పుడూ ఒకే కోడ్ ఉంది…

జిల్లాల వారీ గా మారిన కోడ్ లు

ఆదిలాబాద్: TS 01

కరీంనగర్:  TS 02

వరంగల్ :  TS 03

ఖమ్మం :  TS 04

నల్గొండ: TS 05

మహబూబ్ నగర్: TS 06

రంగారెడ్డి: TS 07,TS 08

హైదరాబాద్: TS 09,10,11,12,13,14

మెదక్: TS 15

నిజామా బాద్: TS 16

(Visited 138 times, 19 visits today)

Comments

comments