Home / Political / 1032 పోస్టులకు గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

1032 పోస్టులకు గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.

Author:

తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు తీపి కబురు. ఎన్నాల్లుగానో ఎదురుచూస్తున్న గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గురువారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వివిధ శాఖలలో ఖాళిగా ఉన్న మొత్తం 1032 పోస్టులను ఈసారి భర్తి చేయనున్నారు. గతంలో గ్రూప్‌-2 పరీక్షకు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్త అప్లికేషన్లు సెప్టెంబర్‌ 2 నుండి 23 వ తేది వరకు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకొవచ్చు. నవంబర్‌ 12, 13 తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. సో, ఇక లేట్ చేయకుండా చదవడం మొదలుపెట్టంది.

Telangana-Group-2-2016-Notification-Released

వివిధ శాఖలలో ఖాళిగా ఉన్న పొస్టులు:

 • ఎక్సైజ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్లు-284
 • డిప్యూటీ తహసీల్దార్లు-259
 • ఏసీటీవోలు-156
 • సచివాలయ ఏఎస్‌వోలు-90
 • పంచాయతీరాజ్‌ విస్తరణ అధికారులు-67
 • సహకారశాఖ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్లు-62
 • ఆర్థిక శాఖ ఏఎస్‌వోలు- 28
 • సబ్‌రిజిస్ట్రార్లు-23
 • చేనేత ఏడీవోలు 20
 • మున్సిపల్‌ కమిషనర్లు- 19
 • దేవాదాయశాఖ ఈవోలు-11
 • న్యాయశాఖ ఏఎస్‌వోలు- 10
 • అసిస్టెంట్‌ లేబర్‌ ఆఫీసర్లు- 3

 

(Visited 344 times, 16 visits today)