Home / Political / తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2017-18 లోని ముఖ్య విషయాలు.

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2017-18 లోని ముఖ్య విషయాలు.

Author:

2017-18 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఈరోజు శాసనసభ సమావేశంలో ప్రవేశపెట్టారు. మొత్తం 1,49,446 కోట్ల రూపాయలకు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో వివిధ శాఖలకు కేటయింపులు ఈ విధంగా ఉన్నాయి.

 • తెలంగాణ రాష్ట్రం మొత్తం బడ్జెట్ : రూ.1,49,446 కోట్లు
 • నిర్వహణ వ్యయం : రూ.61,407 కోట్లు
 • ప్రగతి పద్దు : రూ.88,038 కోట్లు
 • రాష్ట్ర సొంత ఆదాయం : రూ.69,220 కోట్లు
 • రెవెన్యూ మిగులు అంచనా : రూ.4,571 కోట్లు
 • పంచాయతీ రాజ్ శాఖకు రూ.14,723 కోట్లు
 • ఎస్సీ సంక్షేమానికి రూ.14,375 కోట్లు
 • విద్యా రంగానికి రూ.12,705 కోట్లు
 • ఎస్టీ డెవలప్ మెంట్ ఫండ్ రూ.8,165 కోట్లు
 • వ్యవసాయ రంగానికి రూ. 5,942 కోట్లు
 • రహదారులకు రూ.5,033 కోట్లు
 • విద్యుత్ రంగానికి : రూ.4,203 కోట్లు
 • మిషన్ బగీరథకు రూ.3,000 కోట్లు
 • నీటి పారుదల రంగానికి రూ.2,000 కోట్లు
 • ఫీజు రీయింబర్స్ మెంట్ కు రూ.1,938 కోట్లు
 • చేనేత కార్మికులకు రూ.1,200 కోట్లు
 • పరిశ్రమల రంగానికి రూ.985 కోట్లు
 • రజక, నాయిబ్రాహ్మణుల సంక్షేమానికి రూ.500 కోట్లు
 • ఐటీ రంగానికి రూ.252 కోట్లు
 • పర్యాటకం, సాంస్కృతిక రంగాలకు రూ.198 కోట్లు
 • హరితహారానికి రూ.50 కోట్లు

అంతే కాకుండా బడ్జెట్ సంధర్భంగా ప్రసంగించిన ఈటెల రాష్ట్ర ఆదాయంలో వృద్ధి రేటు 19.61శాతం నమోదయ్యైందని, ఆదాయ వృద్ధి గణనీయంగా పెరిగి రాష్ట్ర వృద్ధి రేటు 10.01% గా ఊహిస్తున్నట్లు తెలిపారు.

(Visited 683 times, 64 visits today)