EDITION English తెలుగు
కాలా సినిమా రివ్యూ & రేటింగ్.   డేవిడ్ వార్నర్ మరియు భార్య కాండిస్ బాల్-టాంపెరింగ్ కుంభకోణం తరువాత గర్భస్రావం చేస్తారు   చైనా హఫీజ్ సయీద్ ను వెలుపలికి వెలుపల కోరుకుంటున్నారు.   MH17 రష్యన్ సైనిక క్షిపణి వ్యవస్థ డౌన్ కూలిపోయింది, పరిశోధకులు చెప్పారు   అమెరికాపై ఆధారపడిన సంబంధం భారత్కు ఎప్పటికీ ఉండదు: నిపుణుడు కాంగ్రెస్ సభ్యులకు చెబుతాడు   హెల్త్కేర్ యాక్సెస్ అండ్ క్వాలిటీలో 195 దేశాలలో నెమ్మదిగా మెరుగుపరుచుకోవడం, భారతదేశం రాంక్స్ 145   ఢిల్లీ మనిషి తన కుమారుని హతమార్చాడు   పెట్రోల్ ధరలు పెరగడంతో పలు నగరాల్లో 80 రూపాయల మేరకు ధరలు పెరిగాయి   కేరళ ప్రభుత్వం గత 24 గంటల్లో బాధిత ప్రాంతాల్లో తాజా కేసులను నమోదు చేయకుండా, సమయానుగుణ జోక్యం ద్వారా వ్యాప్తిని తగ్గించింది.   మనిషి ఇండోర్-గోవా ఇండిగో విమానంలో టేకాఫ్ ముందు తన ప్రియురానికి ప్రతిపాదించాడు.

కరెంటు అవసరం లేని కూలర్.

Author:

ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతున్నాయి, ఉదయం 9 దాటిందంటే చాలు ఇంట్లో నుండి బయటకి రావాలంటే జనాలు భయపడుతున్నారు,ఎండ వేడికి తట్టుకోలేక రోడ్లపైకి జనాల తాకిడి తగ్గిపోయింది, ఇంట్లో ఉన్న కూడా ఉక్కపోతని భరించలేక అల్లాడిపోతున్నారు, ఇక పిల్లలు, ముసలివాళ్ల సంగతి చెప్పనక్కర్లేదు. ప్రతి ఒక్కరు ఏసి లేదా కూలర్ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఏసి, కూలర్ ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి, వీటిని కొనడం మధ్య తరగతి వాళ్ళకి చాలా భారంగా మారింది, కాని కొనక తప్పట్లేదు దానికి ఇంకా కరెంటు బిల్లు అదనం,అందుకే కరెంటు అవసరం లేకుండానే కూలర్ పనిచేస్తే.. ఖర్చు కూడా పెద్దగా లేకుంటే.. ఎలా ఉంటుందనుకుంటున్నారా..? ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే ఎకో కూలర్. కేవలం ఓ అట్టముక్క, కొన్ని ప్లాస్టిక్ సీసాలు ఉంటే చాలు. మీకు ఎకో కూలర్ రెడీ.

బయటి ఉష్ణోగ్రతతో పోల్చితే ఓ అయిదు డిగ్రీల సెంటీగ్రేడ్ తేడా ఉండేలా చేసే ఈ ఎకో కూలర్‌కు విద్యుత్ అవసరమే లేదు. అట్టముక్కకు చిన్న చిన్న రంద్రాలు చేసి, డబ్బాలను సగానికి కత్తిరించి.. సీసా మూతులను రంద్రాల్లోకి ఉండేలా చేయాలి. ఆ అట్టముక్కను కిటికీకి పెడితే చాలు.. చల్లటి, స్వచ్ఛమైన గాలి మీ సొంతం. వడగాలి ఎంత వీస్తున్నా.. మీకు చల్లటిగాలి వస్తుంది. బయటి నుంచి గాలి చిన్న రంద్రం ద్వారా లోపలికి వస్తున్నప్పుడు పీడనానికి లోనయి.. ఉష్ణోగ్రత తగ్గేలా చేస్తుందని తెలుసుకున్న ఈ బంగ్లాదేశ్ ప్రజలు చక్కటి ఐడియాతో, ఏమాత్రం ఖర్చులేకుండా వేసవిని చల్లగా గడుపుతున్నారు. మరీ మీరూ ట్రై చేయండి. వారు ఏ విధంగా తయారు చేశారో మీరూ చూడండి.

Must Read: ఒక్క లీటర్ పెట్రోల్ తో 410 కిలోమీటర్ల మైలేజి.

(Visited 4,072 times, 107 visits today)

Comments

comments