టికెట్ కావాలంటే కూల్ డ్రింక్ కొనాల్సిందే…! సామాన్యులని దోచుకుంటున్న మల్టీ ప్లెక్స్ లు.

Author:

సినిమాలకి ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకు మల్టీ ప్లెక్స్ థియేటర్ ల యాజమాన్యాలు సరికొత్త దోపిడీని మొదలు పెట్టాయి, కాంబో ఆఫర్లు అంటూ ప్రేక్షకుల జేబు నుండి ఎక్కువమొత్తంలో డబ్బులు కొట్టేయడానికి స్కెచ్ వేసాయి, ఈ నెల 28 వ తేదీన విడుదల అవుతున్న బాహుబలి 2 సినిమాకి ఉన్న డిమాండ్ ని క్యాష్ చేసుకునేందుకు థియేటర్ యజమానులు ప్రేక్షకులకి కొత్త కండిషన్ లు పెడుతున్నారు, తమ థియేటర్ లలో సినిమా చూడాలంటే టికెట్ తో పాటు ఖచ్చితంగా కూల్ డ్రింక్ , పాప్ కార్న్ తీసుకోవాల్సిందే అని రూల్స్ పెడుతున్నారు, ప్రేక్షకుడికి కూల్ డ్రింక్ ఇష్టం లేకపోయినా సినిమా టికెట్ కావాలంటే కూల్ డ్రింక్ కి కూడా డబ్బులు చెల్లిస్తేనే టికెట్ ఇస్తున్నారు, ఇలా కార్పొరేట్ తరహాలో ప్రేక్షకుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు.

movie tickets with cool drinks

టికెట్ రేట్ రూ.100 ఉంటే కూల్ డ్రింక్ కి కలిపి రూ.130 ఇస్తేనే టికెట్ ఇస్తున్నారని ప్రేక్షకులు వాపోతున్నారు, ఇదేంటి అని ప్రశ్నిస్తే టికెట్ కావాలంటే తీసుకో, లేకపోతే లేదు అని థియేటర్ యాజమాన్యాలు బెదిరిస్తున్నారు, చట్టం ప్రకారం టికెట్ తో పాటు ఇలా కూల్ డ్రింక్ , పాప్ కార్న్ లు అమ్మకూడదు, ప్రేక్షకులకి ఇష్టం అయితేనే కొనుక్కుంటారు, ఇలా బలవంతంగా కూల్ డ్రింక్ లు అంటగట్టడం మోసపూరిత నేరం కిందికి వస్తుంది, ఈ విధంగా సినిమాపై ఉన్న క్రేజ్ ని క్యాష్ చేసుకొని లక్షలు లక్షలు దండుకుంటున్నారు,  ఎవరైనా కాంబో ఆఫర్ అంటూ బలవంతంగా టికెట్ తో పాటు కూల్ డ్రింక్ అమ్మితే ఆధారాలతో ఫిర్యాదు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటాం అని వినియోగదారుల ఫోరమ్ అధికారులు తెలిపారు, మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే వెంటనే వినియోగదారుల ఫోరమ్ లో ఫిర్యాదు చేయండి.

(Visited 470 times, 33 visits today)