Home / Entertainment / 16న పంచ్ పవర్ చూపించనున్న బ్రూస్ లీ ద ఫైటర్.

16న పంచ్ పవర్ చూపించనున్న బ్రూస్ లీ ద ఫైటర్.

Author:

బ్రూస్ లీ తెలుగు సినిమాలో ఒక సరికొత్త సంచలనం గా వస్తున్న సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా ‘బ్రూస్ లీ’ సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకొని, ఎలాంటి కట్స్ లేకుండా ‘యు/ ఏ’ సర్టిఫికేట్ అందుకొని అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి రెడీ గా ఉంది. ప్రస్తుతం అన్ని ఏరియాలకు వెళ్ళాల్సిన ప్రింట్స్ డిస్పాచ్ వర్క్ జరుగుతోంది.అంతే కాదు ఈ సినిమా ద్వారా మరో మంచి పనీ జరగబోతోంది, ఈ బెనిఫిట్ షో ద్వారా వచ్చే డబ్బులని ఓ అనాధ శరణాలయానికి ఇచ్చేలా మెగా ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారట.

సెన్సార్ వర్గాల సమాచారం ప్రకారం సినిమా సూపర్ హిట్ ఖాయమే.మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో ఒక 5 నిమిషాల పాటు కనిపించనుండడం వలన ఈ సినిమాకి మరింత క్రేజ్ నెలకొంది. శ్రీను వైట్ల స్క్రీన్ ప్లే సినిమాని అద్బుతంగా మార్చిందట. ఫస్టాఫ్ అంతా కోన వెంకట్ కామెడీ తో సాగే సినిమా ఇంటర్వెల్ నుంచీ రొమాన్స్, ఫైట్స్ తో థ్రిల్లింగ్ గా ఉంటుందట.రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించాడు. ఆడియోకి మంచి రెస్పాన్సే ఉంది డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్లోనే అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ కానుంది.

బ్రూస్ లీ సినీమా విడుదల అవుతున్న హైదరాబాద్ థియేటర్స్ లిస్టు.

bruce lee the fighter theaters list hyderabad city

(Visited 69 times, 9 visits today)