Home / Inspiring Stories / పఠాన్ కోట్ లో నేలకొరిగిన హీరోలు వీళ్ళే.

పఠాన్ కోట్ లో నేలకొరిగిన హీరోలు వీళ్ళే.

Author:

2016 మనకో విషాదం గానే మొదలైంది పంజాబ్ లోని ఎయిర్ బేస్ వద్ద మూడు రోజుల కింద మొదలైన కాల్పులు ఇంకా కొన సాగుతూనే ఉన్నాయి. శనివారం తెల్లవారు ఝాము నుంచీ మొదలైన పోరాటం లో ఇప్పటికి ఆరుగురు ఉగ్రవాదులని మట్టు పెట్టిన భారత భద్రతా ధళాలు మాత్రం ఏడుగురు జవాన్ లని కోల్పోయింది. వీరే కాక ఒక సామాన్య పౌరుడు కూడా మృతి చెందాడు.ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా రెండు బాంబు పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. దాంతో మరో ఇద్దరు ఉగ్రవాదులు ఇంకా లోపల నక్కి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆపరేషన్ కొనసాగుతోంది. శుక్రవారం నాడు ఎస్పీ వాహనంపై దాడిచేసింది ఐదుగురే అయినా.. ఇప్పటికే ఆరుగురు చనిపోవటం ఇంకా కాల్పులు జర్పుతునండటంతో అసలు లోపల ఇంకా ఎంత మంది ఉన్నారన్న దాని మీద ఇంకా స్పష్టత రాలేదు… అక్కడ ప్రస్తుతం ఆర్మీ హెలికాప్టర్లతో పాటు బుల్డోజర్లను కూడా ఉపయోగిస్తున్నారు. పెద్ద ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మరికొన్ని గంటల పాటు ఇది కొనసాగే అవకాశం ఉంది.

దేశం కోసం నేలకొరిగిన సైనిక యోధులు వీరే….

1.లెఫ్టినెంట్.కల్నల్ నిరంజన్

niranjan-kumar

 బాంబ్ డిస్పోజబుల్ స్క్వాడ్ లో మెంబర్ అయిన 35 ఏళ్ళ కమెండో నిరంజన్ మరణించిన ఉగ్రవాది చేతిలోని గ్రనేడ్ ని నిర్వీర్యం చేయబోతూండగా పేలటం తో ప్రాణాలు కోల్పోయాడు. కేరళా కు చెందిన నిరంజన్ బెంగుళూర్ లో పుట్టారు. పెళ్ళై మూడేళ్ళయింది… భార్యా, 2 సంవత్సరాల కూతురు ఉన్నారు. అంత్య క్రియల కోసం ఆయన మృత దేహం కొద్ది గంటల క్రితమే చేరుకుంది…

2.సుబెందర్ ఫతే సింగ్:డిఫెన్స్ సెక్యూరిటీ కార్పొరల్

fateh-singh

51 ఏళ్ళ ఫతే సింగ్ కి ఉన్న మరో పేరు “చాంపియన్ షూటర్” కామన్ వెల్త్ క్రీడల్లో బంగ్గరు,వెంది పతకాలను మన దేశం తరఫున సాధించాడు. కానీ ఈ అద్బుతమైన షూటర్ ఇప్పుడు ఉగ్రవాదుల టార్గెట్ అయ్యాడు. ఈ దేశం ఒక యోధున్ని కోల్పోయింది..

3.కార్పొరల్ గురుసేవక్ సింగ్ — గరుడ్ కొమాండో ఫోర్స్

gursewak-singh

అంబాలాకు చెందిన గురుసేవక్ సింగ్ ఒక రైతు బిడ్డ ఎంతో కష్టమ్మీద చదువుకున్నాడు. తన మొదటి ప్రయత్నం లోనే ఎయిర్ ఫోర్స్ ఎంట్రన్స్ కొట్టాడు. ఆరుసంవత్సరాల క్రితం సైన్యం లో చేరిన గురుసేవక్ పెళ్ళి జరిగి కేవలం 45 రోజులే అవుతోంది. ” ఔను నాకొడుకు చనిపోయాడన్నాప్పుడు భాద కలిగింది కానీ..! అతను దేశం కోసం చనిపోయాడు అని గుర్తొచ్చాక గర్వంగా ఉంది” సింగ్ మృతదేహం ముందు నిలబడి అతని తండ్రి పలికిన మాటలివివి.

4.హవల్దార్ ఖుల్వంత్ సింగ్ — డిఫెన్స్ సెక్యూరిటీ కార్పొరల్

kulwant-singh

5.హవల్దార్ సంజీవన్ సింగ్ రాణ అ — డిఫెన్స్ సెక్యూరుటీ కార్ప్.

sanjeevan-singh-rana

సంజీవన్ తండ్రి రతన్ రాణా మాజీ సైనికుడే. 51 ఏళ్ల రాణా హిమాచల్ ప్రదేశ్ లో ఒక కుగ్రామానికి చెందిన వాడు భార్యా,ముగ్గురుపిల్లలూ ఉన్నారు. ఎయిర్ఫోర్స్ బేస్ లోకి ధైర్యంగా ముందు దూసుకు వెళ్ళిన రాణా ఉగ్రవాదుల కాల్పుల్లో మొదటగా నేలకొరిగారు. చాతీలోకి అయిదు బుల్లెట్లు దూసుకు పోయినా ప్రాణం పోయే దాకా కాల్పులు జరిపాడు.

6. హవల్దార్ జగ్దీశ్ ఛంద్ — డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్.

Jagadish

హిమాచల్ ప్రదేశ్ చంబాకు చెందిన జగదీష్ 10 రోజుల సెలవు ముగించుకొని దాడికి ఒక రోజు ముందే పఠాన్ కోత్ వచ్చాడు. కాల్పులు మొదలయ్యే సమయానికి అతను కిచెన్ లో ఉన్నాడు. తనకు ఎదురుపడ్డ ఉగ్రవాది పై కలబడి ఆయుధాన్ని లాకోని దానితోనే అతన్ని చంపేసాడు. ఐతే ఇద్దరి మధ్యా జరిగ్న పెనుగు లాటలో తగిలిన గాయాలతో చాంద్ మృతి చెందారు.

7.లాన్స్ నాయక్ పూలవత్ సింగ్.

లాన్స్ నాయక్ పూలవత్ సింగ్ ఉగ్రవాదులతో పోరాడుతూ వారి తూటాలకు బలయ్యాడు, పూలవత్ సింగ్ చివరి క్షణాల్లో “భారత్ మాత కి జై ” అంటూ తన ప్రాణాన్ని భారత దేశ రక్షణ కోసం వదిలాడు.

ఇంకొంత మంది సైనికులు పఠాన్ కోట్ ఎయిర్ బేస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు, వారిలో కొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు మిలటరీ వర్గాల ద్వారా తెలిసింది.

 Must Read: 360 ప్రాణాలను కాపాడి కనుమూసిన యువతి కథే “నీరజ”.

(Visited 3,633 times, 31 visits today)